Home Film News Samantha : సమంత టాప్ అండ్ స్లిట్ స్కర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా!
Film News

Samantha : సమంత టాప్ అండ్ స్లిట్ స్కర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా!

SAMANTHA
SAMANTHA

Samantha: సమంత వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతూ ఫుల్ బిజీగా ఉంది. గుణశేఖర్ డైరెక్షన్లో చేస్తున్న హిస్టారికల్ ఫిలిం ‘శాకుంతలం’ షూట్ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ‘ది ఫ్యామిలీ మాన్ 2’ మేకర్స్‌తో మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌తో పాటు హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది సామ్.

‘యశోద’ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఫిలిం కూడా కమిట్ అయ్యింది. పర్సనల్ లైఫ్‌లో ఏర్పడ్డ అగాధం వాళ్ళ ఏమోకానీ, ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య ఎక్కువ టూర్స్ వేస్తుంది. కాస్త దైవ భక్తి కూడా ఎక్కువైంది. షూటింగ్స్‌కి ఏమాత్రం గ్యాప్ దొరికినా సరే నచ్చిన ప్లేసులన్నిటినీ చుట్టేస్తుంది. అలాగే తన పెట్స్‌తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.

ఇక ఇటీవల ‘పుష్ప’ లో స్పెషల్ సాంగ్‌తో రచ్చ రంబోలా చేసింది. రీసెంట్‌గా సామ్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే, కాస్మో పాలిటన్ ఇండియా మేగజైన్ కవర్ పేజ్ మీద సమంత ఇమేజ్ ప్రింట్ చేశారు.
కాస్మో ఇండియా వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ సెల్లింగ్ మేగజైన్. ఫ్యాషన్, బ్యూటీ, సెలబ్రిటీ న్యూస్, లైఫ్ స్టైల్.. ఇలా ప్రతీ న్యూస్‌ని ఇంట్రెస్టింగ్‌గా కవర్ చేస్తుంటారు. ఇక కవర్ పేజ్ మీద ఉన్న ఫొటోలో సమంత వేసుకున్న డ్రెస్ గురించి నెట్టింటి న్యూస్ వైరల్ అవుతుంది.

కాస్మో పాలిటన్ ఇండియా మేగజైన్ కవర్ పేజ్ కోసం సామ్ స్పెషల్ ఫోటో షూట్ చేసింది. పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన ఎంబ్రాయిడరీ ‘హిమాచల్ బస్టియర్’ టాప్ అండ్ స్లిట్ స్కర్ట్ ధరించింది. కైపెక్కించే కళ్ళతో, మత్తెక్కించే అందాలతో కుర్రకారుకి కంటిమీద కునుకులేకుండా చేస్తుంది సామ్.

ఇంతకీ ఈ డ్రెస్ కాస్ట్ ఏంటో తెలుసా? అక్షరాలా లక్షా ఎనభై వేల రూపాయలు. బాలీవుడ్‌లో పాపులర్ అయిన మేకప్, హెయిర్ స్టైలిస్ట్, సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ ఈ ఫోటో షూట్‌కి వర్క్ చేసారు. కాస్మో పాలిటన్ ఇండియా మేగజైన్ కవర్ పేజ్ కోసం సమంత చేసిన స్పెషల్ అండ్ హాట్ ఫొటోషూట్‌ఃకి సంబంధించిన పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...