Home Film News Suriya – Kamal Haasan : ‘రోలెక్స్’ కి ‘రోలెక్స్ వాచ్’ గిఫ్ట్..
Film News

Suriya – Kamal Haasan : ‘రోలెక్స్’ కి ‘రోలెక్స్ వాచ్’ గిఫ్ట్..

Suriya - Kamal Haasan
Suriya - Kamal Haasan

Suriya – Kamal Haasan: ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే’ అని పాడుకుంటున్నారు లోక నాయకుడు కమల్ హాసన్.. చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆయనకి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ‘విక్రమ్’ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.

కమల్ హాసన్ కిది సరైన కమ్ బ్యాక్ ఫిలిం అంటూ తేల్చేశారు ట్రేడ్ వర్గాల వారు. జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘విక్రమ్’ థియేటర్ల బయట వీక్ డేస్ లోనూ హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు కమల్. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, వెర్సైటల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ క్యారెక్టర్లతో పాటు లాస్ట్‌లో ‘రోలెక్స్ సార్’ రోల్‌తో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేశారు సూర్య.

‘విక్రమ్’ లాంటి విజయవంతమైన చిత్రాన్ని తనకిచ్చినందుకు కృతజ్ఞతగా దర్శకుడికి లగ్జరీ కార్ గిఫ్ట్ ఇచ్చిన కమల్.. ఇప్పుడు సూర్యకి ‘రోలెక్స్’ వాచ్ బహుబతిగా ఇచ్చారు. తన తమ్ముడు సూర్య మీద ప్రేమని మాటల్లో చెప్పలేనని.. అది ఎలా ఉంటుందనేది ‘విక్రమ్ 3’ లో చూపిస్తానని అన్నారు కమల్.

‘‘ఏ మూమెంట్ లైక్ దిస్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్l! థ్యాంక్యూ అన్నా ఫర్ యువర్ రోలెక్స్’’ అంటూ సూర్య ట్వీట్ చేశారు. ప్రస్తుతం సూర్య-కమల్ హాసన్ కలిసున్న పిక్స్ మీడియా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...