Home Film News Heroine: ఒక‌ప్పుడు అందాల‌తో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ ఇప్పుడు సన్యాసిగా మారిందేంటి?
Film News

Heroine: ఒక‌ప్పుడు అందాల‌తో ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ ఇప్పుడు సన్యాసిగా మారిందేంటి?

Heroine: ఎవ‌రి ప‌రిస్థితి ఎప్పుడు ఎలా మారుతుంద‌ని చెప్ప‌డం చాలా క‌ష్టం. ఓడ‌లు బండ్లు, బండ్లు ఓడ‌లు అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. గొప్ప‌గా బ‌తికిన వారు కొన్ని ప‌రిస్థితుల వ‌ల‌న దారుణ‌మైన ప‌రిస్థితిలో ఉండ‌డం కూడా మ‌నం చూశాం.తాజాగా బాలీవుడ్ లో గ్లామర్ క్వీన్ గా ఉన్న ఓ బ్యూటీ తన కలర్ ఫుల్ లైఫ్ ను త్యాగం చేసి స‌న్యాసి జీవితాన్ని గడుపుతుంది. ఇప్పుడు ఈ విష‌యం తెలిసి అంద‌రు షాక్ అవుతున్నారు. బ‌ర్జా మ‌ద‌న్ అనే బాలీవుడ్ భామ తెలుగు ప్రేక్ష‌కులు వెంట‌నే గుర్తు ప‌ట్ట‌రు. కాని ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన భూత్ మూవీలో దెయ్యం పట్టిన అమ్మాయిగా నటించిన భామ అంటే ఇట్టే గుర్తు ప‌డ‌తారు.

ఆర్జీవీ తెర‌కెక్కించిన భూత్ మూవీలో బర్ఖా మదన్‌ నటన చూసి థియేటర్లో ప్రేక్షకులు తెగ వణికిపోయారంటే … ఆమె ఏ రేంజ్ లో నటించి మ‌న‌కు అర్ధం అవుతుంది. ఈ సినిమాక చూశాక ప‌గ‌లు కూడా క‌ల్లోకి బర్జా మదన్ వ‌చ్చి భ‌య‌పెట్టించింది. ఈ చిత్రంలో అంత భ‌య‌పెట్టిన ఈ భామ ప‌లు సినిమాల‌లో త‌న గ్లామ‌ర్ షోతో మ‌త్తెక్కించింది. పంజాబీ కుటుంబలో జన్మించిన బ‌ర్ఖా.. సినిమాల్లోకి రాకముందు మోడల్ గా మెరిసింది. ఈమె ఐశ్వర్య రాయ్. సుస్మితా సేన్ లాంటి వారితో పోటీ పడింది. ఇక 1994 లో మిస్ ఇండియాగా పోటీ చేయ‌గా, సుస్మితా సేన్ ను కిరీటం వరించగా.. రన్నరప్ గా ఐశ్వర్య రాయ్ నిలిచింది. బర్ఖా మదన్ మిస్ టూరిజం ఇండియాగా ఎంపికైంది.

అక్షయ్ కుమార్, రవీనా టాండన్ నటించిన ఖిలాడియోన్ కా ఖిలాడిలో నటించిన బర్ఖా మదన్… ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకొని త‌న స‌త్తా చాటింది. ఇండో-డచ్ చిత్రం డ్రైవింగ్ మిస్ పామెన్‌తో విదేశీ చిత్రాల్లో కూడా ఈ అమ్మ‌డు త‌న న‌ట‌న‌తో మెప్పించింది. త‌న మాతృభాష పంజాబీలో కూడా స‌త్తా చాటింది. మ‌రోవైపు బుల్లి తెరపై దాదాపు 20 టీవీ షోలు చేసి రికార్డ్ సాధించింది . అయితే సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన బర్ఖా మదన్.. సన్యాసం తీసుకొని అందరిని ఆశ్చర్యపరచింది. బౌద్ద మతం వైపు ఆకర్శితురాలై.. . 2012 లో బుద్దీజం స్వీకరించింది. ఈ క్రమంలోనే బర్ఖా మదన్ లామా జోపా రిన్ పోచే పర్యవేక్షణలో సన్యాసం స్వీకరించింది. ప్రస్తుతం ఆమెను గ్యాల్టెన్ సామ్టెన్ గా పిలుస్తారు. బుద్దీజం స్వీకరించిన తర్వాత తన మనసు ప్రశాంతంగా ఉంద‌ని అంటుంది ఒకప్పటి అందాల భామ.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...