Home Film News మహేష్ – సాయి పల్లవి కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీలు ఏమిటో తెలుసా..!
Film News

మహేష్ – సాయి పల్లవి కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీలు ఏమిటో తెలుసా..!

చిత్ర పరిశ్రమల్లో కొన్ని క్రేజీ కాంబినేషన్లు ఉంటాయి.. అలాంటి కాంబోలో మహేష్ – సాయి పల్లవి కాంబినేషన్ కూడా ఒకటి. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఆశ‌ప‌డుతున్న‌రు. కానీ ఆ సమయం మాత్రం రావడం లేదు. గతంలో మహేష్ – సాయి పల్లవిల‌ కాంబోలో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్సయ్యాయి. వింటుంది నిజమే.. ఆ మిస్సయిన సినిమాలు ఏమిటో ఇక్క‌డ‌ చూద్దాం. ఫిదా సినిమాతో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి టాలీవుడ్‌కి పరిచయమైంది.

Did Sai Pallavi get married secretly? here's the truth behind the viral  picture | Tamil Movie News - Times of India

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమూవీ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను ఎంత‌గానో ఆకట్టుకుంది అదే విధంగా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక తన తొలి సినిమాతోనే సాయి పల్లవి టాలీవుడ్‌ను మాయ చేసింది.. ఈ క్రమంలోనే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయాలనుకున్నాడట.

మహేష్ కు కూడా ఈ కథ బాగా నచ్చిందట. కానీ ఇతర సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండటంవల్ల మహేష్ ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చింది. అలా మహేష్ – సాయి పల్లవి కాంబోలో ఈ సూపర్ హిట్ సినిమా మిస్సయింది. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో మరో బ్లాక్ బస్టర్ మూవీ తప్పిపోయింది. ఆ సినిమా మరి ఏదో కాదు సరిలేరు నీకెవ్వరు. దర్శకుడు అనిల్ రావుపూడి – మహేష్ కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది.

Sai Pallavi in awe of Mahesh Babu's looks - TeluguBulletin.com

అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మూవీ యూనిట్ సాయి పల్లవినేే అనుకున్నార‌ట‌. ఈ సినిమా స్టోరీ విన్న సాయి పల్లవి అందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదున్నే కారణంగా ఈ సినిమాకు నో చెప్పింది. ఈ విధంగా రెండోసారి కూడా మహేష్ – సాయి పల్లవి కాంబోలో రెండో సినిమా మిస్ అయింది. అయితే ఇప్పుడు మ‌హేష్, రాజామౌళి కొంబోలో వ‌చ్చే మూవీలో సాయిప‌ల్ల‌వి ఓ కీల‌క పాత్ర‌లో నంటించ‌బోతుంది అనే టాక్ కూడా ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మ‌రింది. అయితే రాబోయే రోజుల్లో వీరి కాంబోలో ఎలాంటి మూవీ వ‌స్తుందో చూడాలి.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...