Home Film News Mahesh: ఈ వ‌య‌స్సులో మ‌హేష్ బాబుని రాజ‌మౌళి అంత టార్చ‌ర్ చేస్తున్నాడా.. ఏకంగా మూడు నెల‌ల పాటా..!
Film News

Mahesh: ఈ వ‌య‌స్సులో మ‌హేష్ బాబుని రాజ‌మౌళి అంత టార్చ‌ర్ చేస్తున్నాడా.. ఏకంగా మూడు నెల‌ల పాటా..!

Mahesh: దర్శ‌క ధీరుడు రాజ‌మౌళి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాహుబ‌లి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లు పాకేలా చేసిన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో  చ‌రిత్ర సృష్టించాడు. ఇన్నాళ్లు తెలుగు సినిమా ఆస్కార్ కోసం ఎంతో ఎదురు చూడ‌గా, ట్రిపుల్ ఆర్‌తో ఆ కోరిక కూడా తీరింది. ఇక ఇప్పుడు మ‌హేష్ బాబుతో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం చేయ‌నున్నాడు రాజ‌మౌళి. ఈ సినిమాతో ఇంకెన్ని చ‌రిత్ర‌లు సృష్టిస్తాడా అని ప్ర‌తి ఒక్క‌రు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాని ఆగ‌స్ట్ 9న ప్రారంభించి వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రిపేలా ప్లాన్ చేస్తున్నారు జ‌క్క‌న్న‌.

రాజ‌మౌళి- మ‌హేష్ బాబు సినిమాల‌కి సంబంధించి కొద్ది రోజులుగా అనేక వార్త‌లు వ‌స్తున్నాయి.  భారీ అంచ‌నాలు పెంచేలా ఈ  చిత్రం ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, మూవీ సెట్స్ కి వెళ్లే ముందు  యాక్షన్ సన్నివేశాలపై వర్క్ షాప్స్ ని  నిర్వ‌హించి మూడు నెల‌ల పాటు మ‌హేష్ బాబుకి ట్రైనింగ్ ఇవ్వ‌బోతున్నార‌ట‌. గ‌తంలో రాజ‌మౌళి ఇలాంటి ట్రైనింగ్ క్యాంపులు నిర్వ‌హించిన అవి కేవ‌లం ప‌ది రోజులు మాత్రమే ఉండేవి. మ‌హేష్ బాబు హీరోగా రూపొంద‌నున్న సినిమా కోసం   ఏకంగా మూడు నెలల ట్రైనింగ్ ఇవ్వ‌బోతున్నాడ‌ని వార్తలు వ‌స్తున్నాయి.. దీంతో ఈ సినిమా ఏ రేంజ్‌లో తీయ‌నున్నాడో అర్ధ‌మ‌వుతుంది.

హాలీవుడ్ రేంజ్‌లో మూవీ ఉండ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో తియ్యబోతున్న ఈ ప్రాజెక్ట్ ని  మొత్తం మూడు పార్టులుగా రాజ‌మౌళి తెరకెక్కిస్తారట. మ‌రి బాహుబ‌లి చిత్రాన్ని రెండు పార్ట్‌లు తీసేందుకే ఐదు సంవ‌త్సరాల స‌మ‌యాన్నితీసుకున్న రాజ‌మౌళి ఇప్పుడు మ‌హేష్ బాబు చిత్రానికి ఇంకెంత స‌మ‌యం తీసుకుంటాడా అని ప్ర‌తి ఒక్క‌రు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. ఇక‌ ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి  వివరాలు తెలియాలంటే ఆగష్టు 9 వరకు ఆగాల్సిందే. ఇక మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం సూపర్ స్టార్ మ‌హేష్ బాబు ద‌ర్శ‌కత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నుంది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...