Home Film News బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!
Film News

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే వ‌రుస విజ‌య‌లు అందుకుంటూ త‌మ‌ సత్తా చాటుతున్నారు. వారిలో నటసింహాం నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ఇక బాల‌య్య త‌న 40 సంవ‌త్స‌రల సిని కేరీర్ ఎప్పుడు లేనింత‌గా హ్య‌ట్రిక్ విజ‌య‌ల‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న‌డు. ఇదే జోష్‌లో త‌న 109వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న ఈ మూవీని టాలీవుడ్ మెగా డైరెక్టర్ బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర తెకెక్కిస్తాన్న‌డు.

Nandamuri Balakrishna's NBK 109 Goes on Floors

ఈ చిత్రం 1980వ నాటి దశకం కథతో రాబోతున్నట్లు న్యూస్ వైరల్ అయింది. అయితే, ఇటీవల వచ్చిన గ్లింప్స్‌లో బాలయ్య లేటెస్ట్ లుక్‌తో కనిపించారు. దీంతో దీనిపై అంచనాలు మ‌రింత పెరగ్గా.. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని రూపొందిస్తున్నారు. బాలయ్య మార్క్ యాక్షన్, బాబీ మార్క్ డ్రామాతో రాబోతున్న‌ ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు. ఆ తర్వాత మూవీ యూనిట్ రాజస్థాన్‌తో పాటు చాలా ప్రాంతాలకు వెళ్లి మరీ చిత్రీకరణ జరిపింది.

NBK 109 First Glimpse | NBK 109 First Glimpse | కల్ట్ సరుకుతో వచ్చేసిన Nandamuri Balakrishna |Bobby Kolli | ABP Desam

ఇప్పుడు కూడా ఈ సినిమా షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఎంతో శరవేగంగా జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చాలా వరకూ పూర్తవడంతో ఈ సినిమాకి సంబందించిన‌ ఎన్నో అంశాలు బయటకు వచ్చేశాయి. ముఖ్యంగా ఇందులో ఫలానా ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుందని, ఫలానా పాట బాగుంటుందని, ఫలానా ఫైట్ అదిరిపోతుందని ఎన్నో రకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. బాలకృష్ణ – బాబీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉండబోతుందని తాజాగా ఓ వార్త హల్చల్ చేస్తోంది.

BALAYYA MOVIE TITLE : వేటాడబోతున్న బాలయ్య.. నెక్ట్స్ మూవీ టైటిల్ ఫిక్స్.. | BALAKRISHNA NEXT MOVIE TITLE FIX

దీనికి కారణం అప్పుడే బాలయ్య రెండో పాత్ర ఎంట్రీ ఇస్తుందట. ఒకరకంగా ఇది ‘లెజెండ్’ మూవీని గుర్తు చేసేలా ఉంటుందని అంటున్నారు. దీంతో ఆ సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా హిట్‌ అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.ఇదిలా ఉండగా.. బాలయ్య హీరోగా బాబీ తీస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశీ రౌటేలా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ జూన్ లేదా జూలైలో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే ఉపులో బాలయ్య తన 110 సినిమాను కూడా మొదలు పెట్టబోతున్నాడు. ఇలా బాలయ్య వరుస సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీగా ఉన్నాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...

చిరు- బాల‌య్య కాంబోలో మిస్ అయిన మల్టీస్టారర్.. దీని వెనుక ఇంత క‌థ ఉందా..!

ఇక చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాల్లో కొంతమంది హీరోలు చేస్తేనే ఎంతో బాగుంటుంది. మరికొందరు చేస్తే...