Home Film News అప్ప‌ట్లో కోట్ల న‌ష్టం మిగిల్చిన మెహ‌ర్ ర‌మేష్‌.. భోళా శంక‌ర్‌తోను పెద్ద దెబ్బ కొట్టాడుగా..!
Film News

అప్ప‌ట్లో కోట్ల న‌ష్టం మిగిల్చిన మెహ‌ర్ ర‌మేష్‌.. భోళా శంక‌ర్‌తోను పెద్ద దెబ్బ కొట్టాడుగా..!

స్టార్ హీరోల‌తో క‌లిసి ప‌ని చేసిన ద‌ర్శ‌కుల‌లో మెహ‌ర్ ర‌మేష్ ఒక‌రు. ఆయ‌న గతంలో పూరి జగన్నాధ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా మారాడు.  ప్ర‌భాస్ హీరోగా “బిల్లా” సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన మెహ‌ర్… ఈ సినిమాలో ప్రభాస్ ను చాలా స్టైలిష్ గా చూపించారు. కాక‌పోతే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్‌గా మిగిలింది. చిత్రాన్ని విదేశాల‌లో ఎక్కువ చిత్రీక‌రించ‌డం వ‌ల‌న బ‌డ్జెట్ త‌డిసి మోపెడు అయింది.ఇక మెహ‌ర్  డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు కంత్రి, శక్తీ, షాడో వంటి సినిమాలు  ఆశించిన విజయం తెచ్చుకోక‌పోగా, ప్రేక్ష‌కుల‌కి విసుగు తెప్పించాయి. మెహ‌ర్ ర‌మేష్ కి స్టార్ హీరోల‌తో సినిమాలు చేసే ఛాన్స్ ద‌క్కిన కూడా వాటిని ఉప‌యోగించుకోలేక‌పోయాడు.

మెహర్ రమేష్ కారణంగా టాలీవుడ్ నిర్మాతలకు దాదాపు యాభై కోట్ల రూపాయల వరకు నష్టం రావ‌డంతో, ఆయ‌న‌తో సినిమా తీయ‌డానికి నిర్మాత‌లు వెన‌క‌డుగు వేశారు. దాదాపు 10 ఏళ్ల త‌ర్వాత భోళా శంక‌ర్ సినిమా తీసాడు. మెగాస్టార్ ఇచ్చిన అవ‌కాశాన్ని మెహ‌ర్ ఏ మాత్రం ఉప‌యోగించుకోలేక‌పోయాడు.మూవీకి తొలి రోజే నెగెటివ్ టాక్ రావ‌డంతో ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. చిత్రంలో  మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్, యాక్షన్, డ్యాన్సుల గురించి అందరూ ప్రశంసిస్తున్నాకూడా కథ‌, స్క్రీన్ ప్లే వంటి వాటిపై పెద‌వి విరుస్తున్నారు. . ఔట్ డేటెడ్ కంటెంట్‍తో విసుగెత్తించేలా చేశాడు మెహ‌ర్.. దశాబ్దాల క్రితం నాటి స్టైల్‍లో సీన్స్ పెట్టి చిరాకు తెప్పించాడు.

చిత్రంలో  మెహర్ రమేశ్ డైరెక్షన్ పూర్తిగా నిరాశపరుస్తుంది. గతంలో ఎన్నో  డిజాస్టర్ సినిమాలను తెరకెక్కించి పదేళ్లుగా డైరెక్షన్‍కు దూరంగా ఉన్న మెహర్ రమేశ్.. ఇప్పుడు భోళా శంకర్‌తో కూడా  పూర్తిగా నిరాశపరిచారు. చిత్రంలో చిరంజీవి, శ్రీముఖి మధ్య ఖుషి నడుము సీన్ పెట్ట‌గా, అది చిత్రంలో బ్యాక్‍ఫైర్ అయింది. ప్రేక్షకులు ఈ సీన్‍కు విసుగెత్తిపోయారంటే ఆ సీన్‌ని ఎంత దారుణంగా తెర‌కెక్కించాడో అర్ధ‌మ‌వుతుంది. అజిత్ న‌టించిన వేదాళం మూవీలోని సీన్లను కూడా మెహర్.. భోళా శంకర్‌లో సరిగా రూపొందించ‌లేక‌పోయాడు. భోళా శంక‌ర్‌తోనే మెహ‌ర్ ర‌మేష్ కెరీర్‌కి పులిస్టాప్ ప‌డింద‌ని కొందరు చెప్పుకొస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...