Home Film News Niharika on Casting Couch: ఇష్టంతో వెళ్లాక మ‌ళ్లీ రాద్దాంతం ఎందుకు.. నిహారిక షాకింగ్ కామెంట్స్
Film News

Niharika on Casting Couch: ఇష్టంతో వెళ్లాక మ‌ళ్లీ రాద్దాంతం ఎందుకు.. నిహారిక షాకింగ్ కామెంట్స్

Niharika on Casting Couch: మెగా డాట‌ర్ నిహారిక ఇటీవ‌ల త‌న డైవ‌ర్స్ ఇష్యూతో ఎంత హాట్ టాపిక్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒకప్పుడు నిహారిక అంటే అంద‌రికి సాఫ్ట్ కార్న‌ర్ ఉండేది. కాని ఎప్పుడైతే ఆమె ప‌బ్ లో దొరికిందో అప్ప‌టి నుండి కాస్త నెగెటివిటీ ఏర్ప‌డింది. ఇక పెళ్లైన రెండేళ్ల‌కే విడాకులు తీసుకోవ‌డంతో నిహారికపై పూర్తిగా నెగెటివిటీ వచ్చేసింది. అయితే విడాకుల త‌ర్వాత నిహారిక‌లో ఎలాంటి రియ‌లైజేష‌న్ క‌నిపించ‌డం లేదు. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. ఒక‌వైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసుకుంటూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ షో చేస్తూ తెగ ర‌చ్చ చేస్తుంది.  విడాకులైన రోజుల వ్యవధిలోనే నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండ‌డం అందరిని చాలా ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

ఆమె వ్య‌వ‌హారం ఒకింత  విమర్శల పాలయ్యేలా చేసింది. ఇక  భర్తతో విడిపోయిన బాధ ఆమెకు కొంచెం కూడా లేదని కొంద‌రు దారుణ‌మైన  కామెంట్స్ పెడుతున్నారు.  ఇక నిహారిక ప్ర‌స్తుతం నిర్మాతగా నటిగా బిజీగా ఉండ‌గా, రీసెంట్ ఇంట‌ర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. కొంద‌రు సినిమా ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని అంటే మ‌రి కొంద‌రు అలాంటిదేమి లేద‌ని చెప్పుకొస్తున్నారు. ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా కూడా ఆఫ‌ర్స్ కోసం క‌మిట్‌మెంట్ అడుగుతున్నార‌నేది ఓపెన్ సీక్రెట్. మీటూ ఉద్య‌మం త‌ర్వాతే అంద‌రు దీనిపై ధైర్యంగా మాట్లాడుతున్నారు.

తాజాగా  నిహారిక కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ..  అమ్మాయిలకి ఇష్టం లేకుండా కమిట్ మెంట్లు అనేవి జ‌ర‌గ‌డం అసాధ్యం .  ఎవ‌రైన కూడా వారి ఇష్ట పూర్వకంగా వెళ్లిన తర్వాత మళ్లీ దాని గురించి చర్చ అనేది పెట్ట‌డం వేస్ట్‌.  ఎవరూ బలవంతంగా ఏదీ చేయలేరు. నేను ఒక్క‌టి చెబుతాను. అమ్మాయిలు ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి, వీక్‌గా ఉంటేనే అస‌లు స‌మ‌స్య వ‌స్తుంది. కాస్టింగ్ కౌచ్‌పై గ‌ట్టిగా పోరాటం చేయాలి అంటూ నిహారిక స్ప‌ష్టం చేసింది. ఇప్పుడు మెగా డాట‌ర్ చేసిన కామెంట్స్ ఇండ‌స్ట్రీలోను చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఆమెని కొంద‌రు స‌పోర్ట్ చేసి మాట్లాడుతుంటే, మ‌రి కొంద‌రు మాత్రం విమ‌ర్శిస్తున్నారు .

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...