Home Film News చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!
Film News

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. దర్శకుడు వశిష్ట పక్కా ప్లానింగ్ తో వేసుకున్న ప్రణాళిక వల్ల ఎలాంటి బ్రేకులు పడటం లేదు. వచ్చే ఏడాది సంక్రాంతి జనవరి 10 విడుదలలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని టీమ్ నుంచి వస్తున్న రిపోర్ట్. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియురాలిగా, దేవతగా డ్యూయల్ రోల్ చేస్తోందనే టాక్ ఉంది కానీ అధికారికంగా తెలిసే ఛాన్స్ ఇప్పట్లో లేదు కాబట్టి నిజమైతే బాగుండని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Chiranjeevi Vishwambhara Update | Release Date | Cast

ఇక క్యాస్టింగ్ కు సంబంధించిన కొత్త ఆకర్షణలు చాలా తోడవుతున్నాయని తెలిసింది. ఆల్రెడీ సురభి, ఈషా చావ్లాలు షూట్ లో పాల్గొంటున్నారు. ఆషిక రంగనాథ్ గురించి స్పష్టమైన సమాచారం లేదు. వీళ్ళు కాకుండా యూత్ హీరోలు రాజ్ తరుణ్, నవీన్ చంద్రలను ప్రత్యేక పాత్రల కోసం తీసుకున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్షవర్ధన్ లు కామెడీ భారం మోయగా వీరితో పాటు రావు రమేష్ భూమిక కీల‌క పాత్ర‌ పోషిస్తున్న‌రు.. మీనాక్షి చౌదరి, మృణాల్ ఠాకూర్ ఉంటారనే వార్తకు ఇంకా సరైన ధృవీకరణ రావాల్సి ఉంది.

Video: Megastar Chiranjeevi welcomes Trisha as she joins cast of ' Vishwambhara' - India Today

ఈ లెక్కన వశిష్ట వేసిన ప్లాన్ మాములు లేదు. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఒక పాటని ఇప్పటికే చిత్రీకరించారు. రామోజీ ఫిలిం సిటీలో మరికొన్ని భారీ సెట్ల నిర్మాణం జరుగుతోంది. విజువల్ ఎఫెక్ట్స్ కు చాలా ప్రాధాన్యం ఉన్న విశ్వంభరను గొప్పగా తీర్చిద్దిదేందుకు టీమ్ శర్వశక్తులు ఒడ్డుతోందట. రెండు వందల కోట్ల బడ్జెటనే టాక్ వినిపిస్తోంది కానీ బృందం సభ్యులు ఖర్చు గురించి మాట్లాడ్డం లేదు. వేసవిలోగా షూట్ పూర్తి చేసి ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ కే కేటాయిస్తారని తెలిసింది.

When Chiranjeevi sought Jaya Bachchan's help to cast Amitabh Bachchan for 'Sye Raa Narasimha Reddy'

‘విశ్వంభర’ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం పలు భాషలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్‌ను తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై ఓ అదిరిపోయే సమాచారం బయటకు వచ్చింది.హై రేంజ్ యాక్షన్‌తో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ సినిమాలో చిరంజీవిని ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్‌కు చెందిన కృనాల్ కపూర్ నటిస్తున్నాడట.

Viswambhara: చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే! | Kunal Kapoor to Play Negative Role in Chiranjeevi Starrer Viswambhara Movie - Telugu Filmibeat

అమితాబ్ బచ్చన్ సోదరుడి అల్లుడైన అతడు.. గతంలో ‘దేవ్‌దాస్’ మూవీలోనూ నటించాడు. ఇప్పుడు మరోసారి తెలుగులోకి రాబోతున్నాడు. ఇందులో కృనాల్ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా ఉంటుందని సమాచారం. అయితే, అతడు విలన్ అని తెలిసే ట్విస్ట్ సినిమాలో హైలైట్‌గా ఉంటుందని కూడా తెలిసింది. ఇక భోళా శంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ సినిమా వదులుకుని మరీ విశ్వంభరకు ఓటేసిన మెగాస్టార్ తర్వాత హరీష్ శంకర్ తో చేసే ఛాన్స్ ఉంది. ఇక మ‌రీ విశ్వంభరతో ఎలాంటి సంచ‌ల‌న‌లు క్రియేట్ చేస్తారో చూడాలి.

Related Articles

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...

చిరు- బాల‌య్య కాంబోలో మిస్ అయిన మల్టీస్టారర్.. దీని వెనుక ఇంత క‌థ ఉందా..!

ఇక చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాల్లో కొంతమంది హీరోలు చేస్తేనే ఎంతో బాగుంటుంది. మరికొందరు చేస్తే...