Home Film News Nikhil: నిర్మాత‌తో నిఖిల్‌కి గొడ‌వనా.. స్పై రిలీజ్ ప‌రిస్థితి ఏంటి?
Film News

Nikhil: నిర్మాత‌తో నిఖిల్‌కి గొడ‌వనా.. స్పై రిలీజ్ ప‌రిస్థితి ఏంటి?

Nikhil: హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన నిఖిల్ ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కార్తికేయ 2 చిత్రంతో భారీ హిట్ కొట్టి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. చివరిగా వ‌చ్చిన 18 పేజీస్ అనే చిత్రం కూడా డీసెంట్ స‌క్సెస్‌నే సొంతం చేసుకుంది. దీంతో నిఖిల్ త‌న కెరీర్‌ని స‌క్ర‌మ‌మైన మార్గంలో వెళ్లేలా ప్లాన్స్ చేసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో వ‌రుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం అత‌ని చేతిలో ఐదు పాన్ ఇండియా చిత్రాలు ఉన్న‌ట్టు తెలుస్తుండ‌గా, స్పై అనే చిత్రం జూన్ 29న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు.

ఎడిట‌ర్ గ్యారీ బి.హెచ్ ద‌ర్శ‌క‌త్వంలో స్పై మూవీ రూపొందింది. ఈ సినిమాతోను నిఖిల్ ప‌క్కా హిట్ కొడ‌తాడ‌ని అభిమానులు భావిస్తున్నారు. అయితే స్పై మూవీ రిలీజ్ విష‌యంలో నిర్మాత రాజ‌శేఖ‌ర్‌కు, హీరో నిఖిల్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్తాయ‌నే టాక్ ఒక‌టి న‌డుస్తుంది. జూన్ 15..16 తేదీల్లో సాంగ్ షూటింగ్‌ను ప్లాన్ చేయ‌గా, దాన్ని పూర్తి చేసి జూన్ 23లోపు సెన్సార్‌కు పంపాలి. మరోవైపు సినిమాని ప్ర‌మోష‌న్ చేసుకోవాలి. వీట‌న్నింటికి స‌మ‌యం స‌రిపోదని, స్పై చిత్రాన్ని వాయిదా వేయాలంటూ నిఖిల్ అడిగితే నిర్మాత ఏ మాత్రం ప‌ట్టించుకోలేద‌ట‌.

ఇటీవ‌ల సినిమాకి సంబంధించిన పాట‌ని సైలెంట్‌గా రిలీజ్ చేశారు. ఇది హీరో నిఖిల్‌కి కూడా తెలియ‌ద‌ట‌. త‌న సినిమాలో పాట‌ను త‌న సోష‌ల్ మీడియాలో కూడా పోస్ట్ చేయ‌లేదు అంటే వ్య‌వ‌హారం ఎంత సీరియ‌స్‌గా ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే నిఖిల్ మాట‌ల‌ని నిర్మాత ప‌ట్టించుకోక‌పోవ‌డానికి కార‌ణం..ఇప్ప‌టికే సినిమాపై పెట్టిన మొత్తం నాన్ థియేట్రిల‌క్‌గా వ‌చ్చేసింది. ఇక థియేట్రిక‌ల్ రిలీజ్ విష‌యంలో డిస్ట్రిబ్యూట‌ర్స్ నుంచి డ‌బ్బులు కూడా తీసేసుకున్నాడు. అవ‌న్నీ లాభాలే.. ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తే డిస్ట్రిబ్యూట‌ర్స్ ఒప్పుకోర‌ని అంటున్నారు. స్పై మూవీ టీజ‌ర్ రిలీజ్ త‌ర్వాత సినిమాపై అంచ‌నాలు భారీగానే పెరిగాయి. మ‌రి చివ‌రికి సినిమాని చెప్పిన టైంకి విడుద‌ల చేస్తారా లేక వాయిదా వేస్తారా అన్న‌ది చూడాలి.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...