Home Film News Savitri: మహానటి సావిత్రిని ఆ డైరెక్టర్ రాత్రుళ్లు ఇంటికి తీసుకెళ్లారా
Film News

Savitri: మహానటి సావిత్రిని ఆ డైరెక్టర్ రాత్రుళ్లు ఇంటికి తీసుకెళ్లారా

Savitri:  సినీ ఇండస్ట్రీ మొదలైన తర్వాత తెలుగు తెరపై ఎంతోమంది ఆణిముత్యాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వారిలో ఎంతోమంది ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. వారు భౌతికంగా లేకపోయినా.. వారు వెండితెరపై చేసిన పాత్రలు సినిమా ఉన్నంతకాలం అలా ఉండిపోతారు. మహానటి సావిత్రి గారు ఎన్నో పాత్రల్లో నటించి, ప్రేక్షకుల్ని మెప్పించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచారు. సావిత్రి గారు ఏదైనా పాత్ర వేస్తే ఆ పాత్రకు ప్రాణం వచ్చేలా నటించేవారు. బావోద్వేగాలను మనసు లోతుల్లో నుండి పలికించిన గొప్ప నటి. అలాంటి తార ఈ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు మళ్లీ రాలేదనే చెప్పాలి. అయితే సినిమా ఇండస్ట్రీలో సావిత్రి ఎంతగా ఎదిగారో.. ఆమె చనిపోయే ముందు అంత దీనావస్థలోకి వెళ్లిపోయారు. నా అనే వాళ్లు దగ్గర లేకుండా ఒంటిరిగా పోరాడి అలసిపోయి మృత్యువు ఒడిలోకి చేరారు. సావిత్రి గారు అప్పటికే సినీ ఇండస్ట్రీలో తిరుగులేని నటిగా కోట్లల్లో సంపాదించారు.

ఎంత సంపాదించారో దానధర్మాలు కూడా అంతకన్నా ఎక్కువే చేశారు. సినిమాల్లో నటిస్తున్నప్పుడే తమిళ హీరో జెమినీ గణేషన్ తో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే జెమినీ గణేషన్ కు సావిత్రి గారిని పెళ్లి చేసుకునే కంటే ముందే పెళ్లి జరిగింది. సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది హీరోయిన్లతో అఫైర్లు ఉండేవి. అలా ఓ సారి సావిత్రిని షూటింగ్ లో వదిలేసి.. వేరే హీరోయిన్లతో పార్టీలకు వెళ్లారు. అలా ఇన్నో సందర్భాల్లో సావిత్రి గారిని డైరెక్టర్ ఇలవరసు తన ఇంటికి తీసుకెళ్లేవారట.

అలా ఎన్నో సార్లు జరిగిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. నిజానికి జెమినీ గణేషన్ సావిత్రి గారిని ఒంటరిగా వదిలి వెళ్లినప్పుడు ఇలవరసు ఆమెకు ఒక అన్నయ్యలా అండగా ఉండి.. కాపాడేవారని, అందుకే ఆయన ఇంటికి సావిత్రి గారు కూడా చాలా స్వతహాగా వెళ్లారని సమాచారం. ఈ విషయంపై చాలా మంది పత్రికల వాళ్లు వారి మధ్య ఏదో ఉందని.. రాత్రుళ్లు సావిత్రిని ఇంటికి తీసుకెళ్తున్నారని వార్తలు రాశారు. దీనిపై సావిత్రి గారు మాట్లాడుతూ.. డైరెక్టర్ ఇలవరసు తనకు అన్నయ్యలాంటి వారని.. దయచేసి తప్పుడు వార్తలు రాయోద్దని స్పష్టత ఇచ్చారు.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...