Home Film News Nani Daughter: నాని కూతురు చాలా హుషారుగా ఉందే.. ఆ చిన్నారి గురించి మీకు తెలుసా?
Film News

Nani Daughter: నాని కూతురు చాలా హుషారుగా ఉందే.. ఆ చిన్నారి గురించి మీకు తెలుసా?

Nani Daughter: నేచుర‌ల్ స్టార్ నాని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. వైవిధ్య‌మైన పాత్ర‌లు షోషించి మంచి పేరు తెచ్చుకున్న నాని చివ‌రిగా ద‌స‌రా అనే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించింది. అయితే నానికి ఒకే ఒక్క‌ కొడుకు ఉన్నాడ‌నే విష‌యం ఆయ‌న అభిమానుల‌కి తెలుసు. అప్పుడ‌ప్పుడు త‌న కొడుకుతో స‌ర‌దాగా సంద‌డి చేస్తున్న ఫొటోల‌ని, వీడియోలని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అల‌రిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు కూతురు ఎక్క‌డ నుండి వ‌చ్చింద‌నే అనుమానం అంద‌రిలో ఉంది కదా.. ఈ కూతురు రియ‌ల్ కూతురు కాదులండి, రీల్ కూతురు.

ప్ర‌స్తుతం నాని త‌న 30వ చిత్రంగా హాయ్ నాన్న అనే సినిమా చేస్తుండ‌గా, ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు.   శౌర్యువ్ కి ఇది డెబ్యూ సినిమా కాగా,  ఇందులో నాని జోడిగా సీతారామమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండ‌గా, రీసెంట్‌గా చిత్ర యూనిట్ పోస్ట‌ర్ ద్వారా టైటిల్ రిలీజ్ చేసింది.  మ‌రోవైపు గ్లింప్స్ కూడా విడుద‌ల చేయ‌గా,ఇందులో తండ్రి కూతుళ్ల అనుబంధం ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. సెంటిమెంట్ నేప‌థ్యంలో ఈ సినిమా రూపొందుతుంద‌ని తెలుస్తుంది. అయితే చిత్రంలో   నాని కూతురిగా బేబీ కైరా ఖన్నా నటిస్తోంది. ఈ చిత్రంతోనే  కైరా తెలుగు తెరకు బాలనటిగా పరిచయం కాబోతుంది.

సోష‌ల్ మీడియా ద్వారా చాలా ఫేమ‌స్ అయిన కైరా భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.ఏడేళ్ల చిన్నారి నెట్టింట తెగ సంద‌డి చేస్తూ అల‌రిస్తుంటుంది. ముఖ్యంగా త‌న అక్క మైరా ఖన్నాతో క‌లిసి చేసే సంద‌డి మాములుగా ఉండ‌దు. కైరా ఇన్ స్టాలో 3 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండ‌గా, ఈమె ఎక్కువ‌గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌ని ఇమిటేట్ చేస్తూ ఉంటుంది.   సిద్ధార్థ్ మల్హోత్రా, అలియ్ భట్ వంటి స్టార్లను కలిసి వారితో సరదాగా రీల్స్ చేస్తూ వారి హావ‌భావాలు ప‌లికిస్తూ ఫుల్ ఫేమ‌స్ అయింది. ఇప్పుడు నాని సినిమాలో న‌టిస్తున్న ఈ చిన్నారి ఈ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా ద‌గ్గ‌ర‌వ్వ‌డం ఖాయం.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...