Home Film News Rajinikanth: త‌మ‌న్నాకి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ర‌జ‌నీకాంత్.. స‌ర్‌ప్రైజ్ అయిన మిల్కీ బ్యూటీ
Film News

Rajinikanth: త‌మ‌న్నాకి ఊహించని గిఫ్ట్ ఇచ్చిన ర‌జ‌నీకాంత్.. స‌ర్‌ప్రైజ్ అయిన మిల్కీ బ్యూటీ

Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో త‌లైవా సినిమాలు పెద్ద‌గా విజ‌యం సాధించ‌డలేదు. డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకున్న‌ప్ప‌టికీ ఎందుకో సినిమాలు ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌లేక‌పోతున్నాయి. ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ జైల‌ర్ అనే సినిమాతో బిజీగా ఉన్నారు.  డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్  ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుండ‌గా, ఇందులో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. చిత్రంలో ర‌జనీకాంత్  కరుడుగట్టిన నేరస్తులు ఉండే జైలుకు జైలర్ గా క‌నిపించ‌నున్నారు. ఆగ‌స్ట్ 10న ఈ మూవీ విడుద‌ల కానుండ‌గా, చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

అయితే త‌లైవా తాజాగా  నటి తమన్నాకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడట.  దైవభక్తి ఎక్కువ ఉన్న ర‌జ‌నీకాంత్‌ రాఘవేంద్ర స్వామి భక్తుడు అనే విష‌యం తెలిసిందే. హిమాలయాల్లో ఉన్న ఓ బాబాజీని అమితంగా ఆరాధిస్తారు. మన జీవితంలో జరిగే ప్రతి చర్యకు దేవుడే కారణమని ఆయ‌న న‌మ్ముతుంటారు . తోటి వారిలో ఆధ్యాత్మిక చింతన పెరిగేలా చేస్తాడు ర‌జ‌నీకాంత్‌. ఈ క్రమంలో జైలర్ హీరోయిన్ తమన్నాకు రజినీకాంత్ స‌ర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్ ఇచ్చాడట. రాఘవేంద్ర స్వామి విగ్రహాన్ని, ఓ పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడని స‌మాచారం.  రజినీకాంత్ ఇచ్చిన గిఫ్ట్ కి తమన్నా తెగ మురిసిపోయింద‌ట‌.

ర‌జ‌నీకాంత్ నుండి వ‌చ్చిన ఏ వ‌స్తువు అయిన అమూల్య‌మైన‌ది అని త‌మ‌న్నా అంటుంద‌ట‌. తొలిసారి ర‌జ‌నీకాంత్ స‌ర‌సన జ‌త క‌ట్టిన త‌మ‌న్నాఈ సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకుంది.  ఈ అమ్మ‌డు భోళా శంకర్ అనే చిత్రం కూడా చేస్తుంది.. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుండ‌గా,ఇందులో క‌థానాయిక‌గా కనిపించి అల‌రించ‌నుంది. ఇటీవ‌ల ఈ అమ్మ‌డు  బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారని తెగ ప్ర‌చారం న‌డుస్తుంది. తరచుగా ఈ జంట కలిసి చక్కర్లు కొడుతుండ‌డం అనేక అనుమానాల‌కి ఊత‌మిస్తుంది. ఇక ర‌జ‌నీకాంత్ విష‌యానికి వ‌స్తే.. జైల‌ర్ త‌ర్వాత  కేఈ జానవేల్ రాజా డైరెక్షన్ లో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్ల‌నున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శ‌ర‌వేగంగా కొనసాగుతున్నాయి. తర్వలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంతో ఇప్పటికే సీనియర్ నటుడు అర్జున్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించబోతున్నారని  స‌మాచారం.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...