Home Film News Sreemukhi: శ్రీముఖికి ముద్దు పెట్ట‌బోయిన అవినాష్‌.. గూబ గుయ్యిమ‌నిపించిన యాంక‌ర‌మ్మ‌
Film News

Sreemukhi: శ్రీముఖికి ముద్దు పెట్ట‌బోయిన అవినాష్‌.. గూబ గుయ్యిమ‌నిపించిన యాంక‌ర‌మ్మ‌

Sreemukhi: ఒక‌ప్పుడు వెండితెర‌పై మాత్ర‌మే మ‌న‌కు కొన్ని రొమాంటిక్ సీన్స్ క‌నిపించేవి. కాని రాను రాను అవి బుల్లితెరకి కూడా పాకేశాయి. ప‌లు రియాలిటీ షోల‌లో అమ్మాయిలు, అబ్బాయిలు చేస్తున్న ర‌చ్చ ప్రేక్ష‌కుల‌కి రోత పుట్టిస్తుంది. తాజాగా ఓ షోలో శ్రీముఖి.. అవినాష్‌ని ద‌గ్గ‌ర‌కు లాగ‌డంతో ఆయ‌న ఆమెకు ముద్దిచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. దాంతో అత‌డి గూబ‌గుయ్య‌మ‌నేలా చేసింది శ్రీముఖి. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. వివ‌రాల‌లోకి వెళితే శ్రీముఖి ప్ర‌స్తుతం స్టార్ యాంక‌ర్‌గా దూసుకుపోతుంది.ప్ర‌తి ఛానెల్‌లో కూడా శ్రీముఖిది ఓ షో ఉంది అంటే అతిశ‌యోక్తి కాదు. షోని ఫుల్ ఎనర్జిటిక్‌గా, జోష్‌తో న‌డిపిస్తూ ఉంటుంది శ్రీ.

అందుకే శ్రీముఖికి ఆఫ‌ర్స్ త‌లుపుత‌డుతున్నాయి. ప్ర‌స్తుతం శ్రీముఖి ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే షో హోస్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. రీసెంట్‌గా ఈ ప్రోగ్రామ్ కు సబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, ఇందులో సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన బుల్లితెర స్టార్స్ కంటెస్టెంట్స్ గా వ‌చ్చి సంద‌డి చేసిన‌ట్టు కనిపించింది. ఇక క‌మెడీయ‌న్ అవినాష్ రెట్రో ఓల్డ్ థీమ్ తీసుకుని ఆ టైప్ కాస్ట్యూమ్స్‌లో వచ్చాడు. ఫైమా, హరి త‌మ‌దైన స్టైల్‌లో పంచ్‌లు పేల్చారు. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అంటూ పాత సీరియల్స్‌లోని ఆర్టిస్టులంతా రకరకాల టాస్కులు, పంచ్‌లు, ముద్దులతో నానా ర‌చ్చ చేశార‌న చెప్పాలి.

 

అయితే శ్రీముఖి.. ఓ డైలాగ్ చెపుతూ.. పార్థు… ఒక్కసారి వచ్చి నాకు ముద్దు పెట్టు అంటూ అవినాష్ షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరకు లాగింది. దాంతో అత‌డు పూర్తిగా క్యారెక్ట‌ర్‌లో ఇన్వాల్వ్ అయి శ్రీముఖిని ముద్దు పెట్టుకోబోయాడు. దాంతో అత‌డి చెంప చెళ్లుమ‌నిపించింది శ్రీముఖి. ఆమె కొట్టిన‌ప్పుడు వ‌చ్చిన సౌండ్ విని అందరు షాక్ అయ్యారు. ఎంత గ‌ట్టిగా కొట్టి ఉంటుందో అని ప్రోమో చూసిన వారంద‌రు అనుకుంటున్నారు. ప్రోమో అయితే ప్ర‌స్తుతం నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...