Home Film News Sai Dharam Tej: ఇక నాకు పెళ్లి కాదు.. సాయిధ‌ర‌మ్ తేజ్ షాకింగ్ కామెంట్స్
Film News

Sai Dharam Tej: ఇక నాకు పెళ్లి కాదు.. సాయిధ‌ర‌మ్ తేజ్ షాకింగ్ కామెంట్స్

Sai Dharam Tej: మ‌రి కొద్ది రోజులలో మెగా ఫ్యామిలీ ఇంట పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొన‌బోతుంద‌నే విష‌యం తెలిసిందే. మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ త‌ను ప్రేమించిన లావ‌ణ్య త్రిపాఠితో జూన్ 9న నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి నిశ్చితార్థ వేడుక కేవ‌లం కుటుంబ స‌భ్యుల మ‌ధ్య గ్రాండ్‌గా జ‌రిగింది.ఇక పెళ్లి ఏడాది చివ‌ర‌లో జ‌ర‌గ‌నుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు మొద‌లు అయ్యాయ‌ని,డెస్టినేష‌న్ వెడ్డింగ్‌గా వీరి వివాహం ఉంటుంద‌ని అంటున్నారు. ఇక వ‌రుణ్ తేజ్ పెళ్లి జ‌రుగుతున్న నేప‌థ్యంలో సాయిధ‌ర‌మ్ తేజ్ పెళ్లిపై కూడా చ‌ర్చ న‌డుస్తుంది. వ‌రుణ్ మాదిరిగానే ఇండ‌స్ట్రీకి చెందిన అమ్మాయిని వివాహం చేసుకుంటాడా లేక పెద్ద‌లు చూపించిన పిల్ల‌తో ఏడ‌డుగులు వేస్తాడా అని ముచ్చ‌టించుకుంటున్నారు.

కొద్ది నెల‌ల క్రితం సాయిధ‌ర‌మ్ తేజ్ కి యాక్సిడెంట్ కాగా, ఆయ‌న చావు అంచుల వ‌ర‌కు వెళ్లి వ‌చ్చారు. ఇప్పుడు అత‌నికి పున‌ర్జ‌న్మ అని చెప్పాలి. యాక్సిడెంట్ త‌ర్వాత సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌న కెరీర్ విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ తో కలిసి “బ్రో” అనే సినిమాలో నటించగా, ఈ చిత్రం జూలై 28న విడుద‌ల కానుంది.ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఓ పాత్ర పోషించాడు. అయితే ప‌వ‌న్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో బ్రో సినిమా ప్ర‌మోష‌న్ బాధ్య‌తని సాయి ధ‌ర‌మ్ తేజ్ మోస్తున్నాడు.

 

రీసెంట్‌గా బ్రో సెకండ్ సాంగ్ ఈవెంట్ లో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ తన పెళ్లి పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.. మ‌న‌కి ఇంకెక్కడి పెళ్లి బ్రో .. ఈ సినిమా చేయ‌క‌ ముందు ఎవరో ఒకరు ట్రై చేసేవారు .. ఇప్పుడు మాత్రం అందరూ నన్ను బ్రో అనే పిలుస్తున్నారు ..ఏంటో ఇది ..ఇక నా పెళ్లి అయినట్లే ” అంటూ ఫన్నీగా బదులిచ్చాడు సాయిధ‌ర‌మ్ తేజ్. అయితే ఈ మెగా హీరో ప్రేమ‌లో ఉన్నాడ‌ని, త్వ‌ర‌లోనే గుడ్ న్యూస్ చెప్ప‌బోతున్న‌ట్టు కొంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. ఇక సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇటీవ‌ల విరూపాక్ష చిత్రంతో మంచి హిట్ అందుకోగా, ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించింది.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...