Home Film News రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!
Film News

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే ట్రెండ్ సెట్టర్ సినిమాలుగా నిలిచిపోయాయి.. నటరత్న ఎన్టీఆర్ నుంచి.. నేటి త‌రం హీరోల వ‌ర‌కు ఎన్నో మ‌ల్టీస్టార్ మూవీల్లో న‌టించారు. ఇదే క్ర‌మంలో టాలీవుడ్‌లో ఉన్న ప‌లువురు స్టార్ హీరోలు క‌లిసి న‌టిస్తే చూడాలి అభీమానులు కూడా ఎదురు చూస్తున్న‌రు. అలాంటి స్టార్స్‌లో ఎన్టీఆర్‌-బాల‌య్య మ‌ల్లీస్టార్‌, బ‌న్నీ- చ‌ర‌ణ్ మ‌ల్టీస్టార్ వస్తే చూడాలని టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ అల్లు అర్జున్ మల్టీస్టారర్ పై ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ మధ్య మెగా వార్‌.. కాంపౌండ్ కి నెక్ట్స్ రాజెవరు ?

రామ్ చరణ్, అల్లు అర్జున్.. ఈ ఇద్ద‌రు ఇప్పుడు గ్లోబర్ స్టార్స్. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగింది.. ఇక పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ కూడా అదే స్తాయిలో పెరిగిపోయింది. మరి ఈ ఇద్దరు కలిసి ఓ సినిమా చేస్తే… మెగా అభీమానులు ఆగుతారా.. వారి ఆనందానికి హద్దే ఉండదు. వీరి కాంబోలో గ‌తంలో ఎవడు మూవీ వచ్చింది. కానీ అందులో అల్లు అర్జున్ పాత్ర కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఫుల్ లెంగ్త్ లో వీరి కాంబోలో ఓ సినిమా వచ్చేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారుట‌. ఆ విషయాన్ని కూడా స్వయంగా అల్లు అరవిందే చెప్పుకువచ్చారు. ఇక వివరాల్లోకి వెళితే…

రామ్ చరణ్- అల్లు అర్జున్ కాంబోలో మూవీ వస్తే… మెగా ఫ్యాన్స్ కు పండగే అనే చెప్పాలి. ఇద్దరూ గ్లోబల్ ఇమేజ్ ఉన్న స్టార్స్… కచ్చితంగా నేషనల్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుంది. ఇప్పటికే వీరి కాంబినేషన్లో ఎవడు చిత్రం వచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. అప్పటికీ వీరికి నేషనల్ వైడ్ అంత‌గా గుర్తింపు రాలేదు.. కానీ టాలీవుడ్ లోస్టార్ హీరోలు. ఇక ఎవడులో బన్నీ క్యారెక్టర్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది.

Explained: How Rajamouli's RRR blew competition away at the Oscars 2023? |  Zee Business

కానీ ఆ పాత్రనే ఆ సినిమాకు హైలెట్. మరి ఇప్పుడు ఇద్దరూ గ్లోబల్ స్టార్స్. ఒకరేమో ఆర్ఆర్ఆర్ చిత్రంతో సంచలనం సృష్టిస్తే.. మరొకరు పుష్పతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. రామ్ చరణ్- ఎన్టీఆర్‌… రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ ఆర్ చిత్రంలో అల్లురి సీతారామారాజు క్యారెక్టర్ చేశాడు. అయితే ఈ క్యారెక్టర్ కు వరల్డ్ వైడ్ గా సూప‌ర్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అంతేనా ఇప్పటికీ బాలీవుడ్ వాళ్లంతా అల్లురి సీతారామారాజు అంటే రాముడిగా కోలుస్తున్నారు. రాముడి గెటప్ లో రామ్ చరణ్ ను చూసి ఊగిపోయారు.

మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రూల్ సినిమా ఎంత పెద్ద‌ హిట్ అయిందో చెప్పనవసరం లేదు. ఏకంగా పలు దేశాల్లో సంచలనం సృష్టించింది. క్రికెట్ స్టార్స్ నుంచి రాజకీయా నాయకుల వరకు పుష్పస్వాగ్ తో అదరగొట్టారు. ఎక్కడ చూసిన తగ్గేదేలే డైలాగ్ వినిపించేది. అంతలా ఆ సినిమా జనాల్లోకి వెళ్లింది. ఇప్పుడు పుష్ప 2తో మరింత సంచలనం సృష్టించేందుకు రెడీ అయియాడు అల్లు అర్జున్. మరి వీరి కాంబోలో సినిమా వస్తే.. నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది అన్నీ చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆ సినిమాతో.. బాక్సులు బద్దలు అవ్వాల్సిందే.

ఆ మెగా హీరోలతో భారీ మల్టీ స్టార్ ప్లాన్ చేస్తున్న అల్లు అరవింద్.. నిజమెంత -  Allu Aravind Multi Starer With Ram Charan And Allu Arjun

అయితే వీరి కాంబోలో సినిమా పదేళ్ల క్రితమే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. స్వయంగా ఇదే విషయాన్ని అల్లు అరవింద్ కూడా చెప్పుకువచ్చారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నా అల్లు అరవింద్.. అక్క‌డ‌ తన మనసులోని కోరికను బయటపెట్టాడు. అక్క‌డ‌ అల్లు అరవింద్ మాట్లాడుతూ… నాకో ఒక కోరిక ఉంది … బన్నీ- చరణ్ కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయాలని ఉంది. దానికి నేను ఓ టైటిల్‌ని కూడా రిజిస్టర్ చేశాను. అది కూడా పదేళ్ల క్రితమే. దాని పేరు చరణ్ అర్జున్. ఆ టైటిల్ ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేస్తూనే ఉన్నాను. ఎప్పటికైనా వారితో మూవీ చేస్తును అనీ అల్లు అర‌వింద్ చెప్పుకోచ్చ‌డు.

ఇక అల్లు అరవింద్ చేసిన ఈ కామెంట్స్ సోష‌ల్ మీడియ‌లో మరోసారి వైరల్ గా మారాయి. మరి అల్లు అర్జున్, రామ్ చరమ్ ఇద్దరు గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మరి ఆ లెవెల్ స్ట్రిప్ట్ దొరికితే.. ఈ పేరుతో సినిమా వచ్చే అవకాశం ఉంది. ఇక మరి ఆ మూవీ ఎప్పుడువ‌స్తుతంది అలాంటి కథ ఏ దర్శకుడు తెరకెక్కిస్తాడు.. తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...

చిరు- బాల‌య్య కాంబోలో మిస్ అయిన మల్టీస్టారర్.. దీని వెనుక ఇంత క‌థ ఉందా..!

ఇక చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాల్లో కొంతమంది హీరోలు చేస్తేనే ఎంతో బాగుంటుంది. మరికొందరు చేస్తే...