Home Film News Movies: ఈ వారం సినీ ప్రియుల‌కి పండ‌గే.. థియేట‌ర్‌, ఓటీటీల‌లో సంద‌డి మాములుగా ఉండ‌దు..!
Film News

Movies: ఈ వారం సినీ ప్రియుల‌కి పండ‌గే.. థియేట‌ర్‌, ఓటీటీల‌లో సంద‌డి మాములుగా ఉండ‌దు..!

Movies: ప్ర‌తి వారం కూడా ప్రేక్ష‌కులకి వినోదం పంచేందుకు ఇటు థియేట‌ర్స్, అటు ఓటీటీలలో వైవిధ్య‌మైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రిస్తున్నాయి. ఆగ‌స్ట్ రెండో వారం ప్రేక్ష‌కుల‌కి కావ‌ల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ప‌క్కాగా ఉంటుంద‌ని తెలుస్తుంది. ముఖ్యంగా థియేట‌ర్‌లోకి పెద్ద సినిమాలు రానుండ‌డంతో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఫుల్‌గా ఉండ‌నుంద‌ని స‌మాచారం. ఇక థియేట‌ర్‌లో సినిమాలు రిలీజ్ అయిన నెల రోజులకు లేదంటే 50 రోజులకు ఓటీటీల్లో కి వచ్చేస్తుంటాయి. దీంతో ప్రేక్ష‌కుల‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప‌క్కాగా ఉంటుంది. ఆగ‌స్ట్ రెండో వారం చూస్తే.. ఈ వారం థియేటర్లలో ఐదారు సినిమాలే విడుదలవుతున్నా అవి పెద్ద హీరోల చిత్రాలే కావడంతో పోటీ ఆస‌క్తిగా ఉండ‌నుంద‌ని తెలుస్తుంది.

రజనీకాంత్‌ నటించిన జైలర్‌, చిరంజీవి నటించిన భోళాశంకర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీప‌డ‌నున్నాయి. ఈ రెండు సినిమా మధ్యలో కీరవాణి తనయుడు నటించిన ఉస్తాద్ కూడా థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది. ఇక వీటితో పాటు అక్షయ్‌కుమార్‌ ఓ మైగాడ్‌ 2, సన్నీడియోల్‌ గదర్‌2తో ప్రేక్షకులని ప‌లక‌రించ‌బోతున్నారు. ఇక ఓటీటీ విష‌యానికి వ‌స్తే..అశ్విన్, నందిత శ్వేత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఇన్వెస్టిగేషన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్ హిడింబ- ఆహాలో ఆగస్టు 10 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఇక పోర్‌ తోడిల్‌- సోనీలివ్ లో ఆగస్టు 11 నుండి స్ట్రీమింగ్ కానుంది.

 

చైతన్య రావు, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో.. పల్లెటూరి ప్రేమకథకు క్రైమ్‌ నేపథ్యాన్ని జోడించి ఈ చిత్రాన్ని రూపొందించ‌గా, ఈటీవీ విన్‌లో ఆగస్టు 15 నుండి మూవీని స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఇక విజయ్‌ ఆంటోని హత్య- అమెజాన్ ప్రైమ్ లో ఆగస్టు 20 నుండి స్ట్రీమ్ కానుంది. మ‌రోవైపు ప్రభాస్‌ ఆదిపురుష్ చిత్రం కూడా ఆగస్టులోనే ఓటీటీ రిలీజ్‌ కావొచ్చునని తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఈనెల మూడో వారంలో ఈ మైథలాజికల్‌ మూవీ రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబి ,ఏజెంట్, రామబాణం చిత్రాలు కూడా ఈ నెల‌లో ఓటీటీలోకి రాబోతున్న‌ట్టు తెలుస్తుండ‌గా, వాటి రిలీజ్‌పై అప్డేట్స్‌ రావాల్సి ఉంది.

 

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...