Home Film News Bigg Boss 7: బిగ్ బాస్ 7 సీక్రెట్ బ‌య‌ట పెట్టిన నాగార్జున‌.. కుడి ఎడ‌మైతే అర్ధం ఇదేన‌ట‌..
Film News

Bigg Boss 7: బిగ్ బాస్ 7 సీక్రెట్ బ‌య‌ట పెట్టిన నాగార్జున‌.. కుడి ఎడ‌మైతే అర్ధం ఇదేన‌ట‌..

Bigg Boss 7: బుల్లితెర ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 7 త్వ‌ర‌లోనే మొద‌లు కానుంది. గ‌త సీజ‌న్‌కి దారుణ‌మైన రేటింగ్స్ రావ‌డంతో ఈ సీజ‌న్ అస‌లు ఉండ‌క‌పోవ‌చ్చు అని అంద‌రు అనుకున్నారు. కాని ఇటీవ‌ల వ‌రుస ప్రోమోలు రిలీజ్ చేస్తూ షో అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతున్న‌ట్టు హింట్ ఇచ్చారు. ఇక సీజ‌న్ 7కి నాగార్జున కాకుండా వేరే హీరోని హోస్ట్‌గా తీసుకుంటార‌ని ప్ర‌చారాలు సాగాయి. కాని వాట‌న్నింటికి ఒక్క ప్రోమోతో చెక్ పెట్టారు.  అయితే రీసెంట్‌గా విడుద‌లైన ప్రోమోలో కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని నాగార్జున ఓ పాట అందుకున్నారు. దాని వెన‌క అర్ధ‌మేంట‌ని అంద‌రిలో ఆస‌క్తి మొద‌లైంది.

దీనికి నాగార్జున ఓ క్లారిటీ ఇచ్చారు. బిగ్‌బాస్ షైనింగ్ స్టార్ట్స్ పేరుతో ఓ ఈవెంట్‌ను ఏర్పాటు చేయ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి  గ‌త ఆరు సీజ‌న్ల‌ల‌లో పాల్గొన్న కొంద‌రు కంటెస్టెంట్‌లు హాజ‌ర‌య్యారు. వారంద‌రు క‌లిసి తెగ సంద‌డి చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక‌ షోకి హాజ‌రైన నాగార్జున‌ని కుడి ఎడ‌మైతే పొర‌పాటు లేదు అనే దానికి అర్థం ఏమిట‌ని’   సుమ అడుగుతుంది. అప్పుడు ఆయ‌న  ‘న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్‌, న్యూ రూల్స్ ‘అంటూ కింగ్‌ స‌మాధానం చెప్ప‌డంతో మాజీ కంటెస్టెంట్స్ అంద‌రు గోల చేస్తారు. ఇక  నాగ్ చెప్పిన దాన్ని బ‌ట్టి చూస్తుంటే ఈ సారి బిగ్‌బాస్ సీజ‌న్ అంత‌కు మించి అనేలా ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఇక షో ఎలా ఉంటుంది,  కంటెస్టెంట్లుగా ఎవ‌రు రాబోతున్నారో అని ప్రేక‌క్షులు  చాలా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌స్తుతం బిగ్ బాస్ షో హిందీ, తమిళం, కన్నడతోపాటు.. తెలుగులోనూ  విజయవంతమైంది అని చెప్పాలి.  ఈ షోపై ఎన్ని విమర్శలు  వచ్చినా..కూడా  ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక సీజ‌న్ 7లో  ఇంట్లోకి అడుగుపెట్టేది వీళ్లే అంటూ కంటెస్టెంట్ లిస్ట్ ఒక‌టి    నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆ లిస్ట్‌లో  సీరియల్ యాక్టర్స్ నుంచి యాంకర్స్, కమెడియన్స్, మోడల్స్, యూట్యూబర్స్ ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. మ‌రి వీట‌న్నింటికి త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...