Home Film News RRR Sequel: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుంది కాని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కాదు.. మ‌రి హీరోలెవ‌రంటే..!
Film News

RRR Sequel: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుంది కాని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కాదు.. మ‌రి హీరోలెవ‌రంటే..!

RRR Sequel: ఇన్నాళ్లు తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కి అంద‌ని ద్రాక్ష‌గా ఉన్న ఆస్కార్ అవార్డ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ద‌క్కిన విష‌యం తెలిసిందే. చిత్రంలోని నాటు నాటు పాట‌కి గాను ఆస్కార్ అవార్డ్ ద‌క్క‌డంతో తెలుగోడితో పాటు దేశం కూడా మీసం మెలేసింది. రామ్ చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి ఈ చిత్రాన్ని అత్య‌త ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించారు. స్వాతంత్ర సమరయోధులు అయిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను ఆధారంగా చేసుకుని విజువల్ వండర్ గా రాజమౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా క‌లెక్ష‌న్స్ అందుకొని స‌రికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రంపై  దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు సైతం విమ‌ర్శ‌లు కురిపించ‌డం మ‌నం చూశాం.

అయితే బాహుబ‌లి  మాదిరిగా ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా సీక్వెల్ చేస్తే బాగుంటుంద‌ని చాలా మంది తమ అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. ఇన్నాళ్ల త‌ర్వాత రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ వారికి బ‌దులిచ్చారు. మేము ఆర్‌ఆర్‌ఆర్‌ సీక్వెల్‌ను కూడా తెరకెక్కించే ప్లాన్స్ చేస్తున్నాము. కాక‌పోతే ఇది రాజ‌మౌళి  ద‌ర్శ‌క‌త్వంలో  కాకుండా అతని పర్యవేక్షణలో వేరే డైరెక్టర్‌తో రూపొందే  అవకాశాలున్నాయని విజయేంద్రప్రసాద్ కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయ‌న చేసిన ఈ కామెంట్   అభిమానుల్లో జోష్‌ నింపుతుంది. మ‌రి సీక్వెల్‌లో  రాంచరణ్‌, తారక్‌ లీడ్ రోల్స్ చేస్తారా వేరే హీరోలు ఉంటారా అన్న ప్ర‌శ్న‌కి విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్పందిస్తూ వారిద్ద‌రితోనే సీక్వెల్ ఉంటుంద‌ని తెలియ‌జేశారు.

మ‌రోవైపు   రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్ట్ అయిన‌ మహాభారత్‌ కూడా మహేశ్ బాబు జంగిల్ అడ్వెంచర్‌ మూవీ తర్వాత ట్రాక్‌పైకి అవ‌కాశాలు ఉన్న‌ట్టుగా విజ‌యేంద్ర ప్ర‌సాద్ హింట్ ఇచ్చాడు. మొత్తానికి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఒకేసారి మూడు సినిమాల గురించి ఆస‌క్తిక‌ర అప్‌డేట్స్ ఇచ్చి సినీ ప్రియుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేశాడు. ప్ర‌స్తుతం వారు మ‌హేష్ బాబు 29వ సినిమా కోసం వ‌ర్క్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుండ‌గా,ఆగ‌స్ట్ 9న పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లు కానుంద‌ని అంటున్నారు. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ నుండి ఈ చిత్ర షూటింగ్ జ‌రిగే అవ‌కాశం ఉంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...