Home Film News Mega Princess: వైర‌ల్‌గా మారిన మెగా ప్రిన్సెస్ హ్యాష్ ట్యాగ్.. త‌న ఆనందాన్ని వ్య‌క్త‌ప‌ర‌చిన చిరు
Film News

Mega Princess: వైర‌ల్‌గా మారిన మెగా ప్రిన్సెస్ హ్యాష్ ట్యాగ్.. త‌న ఆనందాన్ని వ్య‌క్త‌ప‌ర‌చిన చిరు

Mega Princess: దాదాపు 11 ఏళ్ల  త‌ర్వాత  రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో అభిమానులు, మెగా కుటుంబ స‌భ్యులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట ధనలక్ష్మీ  అడుగుపెట్టింద‌ని చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో పాటు చిన్న కుమార్తె శ్రీజకు ఇద్దరేసి కుమార్తెలు ఉండ‌గా, ఇప్పుడు  రామ్ చరణ్, ఉసాసన దంపతులకు కూడా కుమార్తె జ‌న్మించ‌డంతో మెగా ఇంట మ‌హాలక్ష్మీల సంద‌డి ఓ రేంజ్‌లో ఉండేలా క‌నిపిస్తుంది.  రామ్ చరణ్, ఉపాసన ఎన్నో ఏళ్లు ప్రేమించుకొని ఆ తర్వాత ఇరువురు కుటుంబ సభ్యుల పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు.

రామ్ చ‌ర‌ణ్- ఉపాస‌న‌ల‌ పెళ్లి పీఠలు ఎక్కడానికీ ఓ సినిమా స్టోరీ కున్నంత తతంగమే నడిచింది. ఇటీవ‌ల వీళ్లిద్దరు 11వ వివాహా వార్షికోత్సవం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ రోజు ఆషాఢ మాసం శుక్ల విదియ మంచి రోజు కావ‌డంతో ఈ డేట్‌కు డాక్లర్ల సలహా మేరకు తమ కొత్త బిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం నెట్టింట మెగా ప్రిన్సెస్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. ఇక త‌న ఇంట వార‌సురాలు అడుగుపెట్ట‌డంతో చిరంజీవి త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా సంతోషం వ్య‌క్తం చేశారు. ‘లిటిల్ మెగా పిన్సెస్ నీకు స్వాగతం. నీ రాకతో  మెగా ఫ్యామిలీ తో పాటు అభిమానులలో ఆనందం వెదజల్లావు. రామ్ చరణ్, ఉపాసనకు ఎల్ల‌ప్పుడు  అందరీ దీవెనలు ఉంటాయి. తాతగా నాకు చాలా ఆనందంగా ఉంది. గర్విస్తున్నాను.’ అంటూ చిరంజీవి త‌న  ట్వీట్ లో పేర్కొన్నారు.

అయితే ఉపాస‌న నిన్న రాత్రి త‌న భ‌ర్త రామ్ చ‌ర‌ణ్‌, అత్త సురేఖ‌తో క‌లిసి  హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అన్ని పరీక్షలు నిర్వ‌హించిన తర్వాత‌ ఈరోజు ఉదయం డెలివరీ చేశారు. పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చిందని ఈ రోజు ప్ర‌క‌ట‌న ద్వారా ఆస్పత్రి బృందం వెల్లడించింది. ఈ శుభవార్త తెలియగానే మెగా ఫ్యామిలీ  ఆనందం అంతా ఇంతా కాదు. ఇక రామ్ చ‌ర‌ణ్ గ‌త కొద్ది రోజులుగా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి త‌న స‌తీమ‌ణిని కంటికి రెప్ప‌లా చూసుకుంటున్నాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...