Home Film News Salman Khan: నేను జైల్లో బాత్‌రూమ్స్ క‌డిగాను.. స‌ల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
Film News

Salman Khan: నేను జైల్లో బాత్‌రూమ్స్ క‌డిగాను.. స‌ల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.  ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని దక్కించుకున్నారు స‌ల్మాన్. మూడు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్న స‌ల్మాన్ ఇప్ప‌టికీ వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నారు. కేవ‌లం హిందీలోనే కాకుండా తెలుగులోను అడ‌పాద‌డపా క‌నిపిస్తున్నారు. స‌ల్మాన్ ఖాన్ ని అభిమానులు ముద్దుగా స‌ల్లూ భాయ్ అని పిలుచుకుంటారు. ఆయ‌న న‌టుడిగానే కాకుండా హోస్ట్‌గాను అద‌ర‌గొడుతుంటారు. అప్పుడప్పుడు వివాదాలతోను వార్త‌ల‌లో నిలుస్తుంటారు స‌ల్మాన్ .ఆయ‌న ప్ర‌స్తుతం బిగ్ బాస్ కార్య‌క్ర‌మానికి  హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ఈ షోలో తాను జైల్లో బాత్‌రూమ్స్ కడిగానంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఇటీవ‌ల బిగ్ బాస్ ఓటీటీ షో మొద‌లు  కాగా, దానికి కూడా స‌ల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఉన్నారు.ఈ షో కోసం స‌ల్మాన్ భారీ పారితోషికం తీసుకున్న‌ట్టు తెలుస్తుంది. అయితే తాజాగా బిగ్ బాస్ ఓటీటీ షో కూడా పూర్తి కాగా, ఇందులో   యూట్యూబర్ ఎల్విష్ యాదవ్   బిగ్‌బాస్ విన్నర్ గా నిలిచాడు. ఇక బిగ్‌బాస్ ఫైనలిస్టుల్లో పూజ భట్ అనే కంటెస్టెంట్ ని స‌ల్మాన్ అభినందించాడు.  హౌజ్‌ని చాలా నీట్‌గా ఉంచావు. ఏ మాత్రం మొహ‌మాట‌ప‌డ‌కుండా బాత్‌రూమ్స్ క‌డిగి చాలా నీట్‌గా ఉంచావు. నీ అంత నీట్‌గా  హౌజ్ ని ఎవ‌రు ఉంచ‌లేరు అంటూ ఆమెఐ ప్ర‌శంస‌లు కురిపించాడు. అలానే తాను కూడా ఒక‌ప్పుడు అలానే బాత్ రూమ్స్ క‌డిగిన‌ట్టు పేర్కొన్నాడు స‌ల్మాన్.

చదువుకునే స‌మ‌యంలో బోర్డింగ్ స్కూల్ లో టాయిలెట్స్ క్లీన్ చేశాను. ఆ తర్వాత జైల్లో ఉన్నప్పుడు కూడా నేను  టాయిలెట్స్ క్లీన్ చేశాను. మన పని మనం చేసుకోవడంలో ఏ మాత్రం సిగ్గు ప‌డ‌కూడ‌దు, అందులో తప్పులేదు. ఏ పని కూడా తక్కువ కాదు. దానికి మనం బాధపడాల్సిన అవసరం లేదు అని స‌ల్మాన్ అన్నారు. అయితే కోట్ల ఆస్తులు ఉన్న స‌ల్మాన్ ఖాన్ టాయిలెట్స్ క‌డిగిన‌ట్టు చెప్ప‌డంతో ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.కాగా,  కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ కొంత కాలం జైల్లో గడిపిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం అత‌ను హిట్ లిస్ట్‌లో ఉన్నాడు. అత‌డిని చంపి తీరుతామంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప‌బ్లిక్‌గానే వార్నింగ్ ఇచ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...