Home Film News Samantha: అర‌గుండులో స‌మంత .. షాకింగ్‌లో అభిమానులు
Film News

Samantha: అర‌గుండులో స‌మంత .. షాకింగ్‌లో అభిమానులు

Samantha: ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో సందడి చేసే స‌మంత జోరుకి బ్రేకులు ప‌డ్డాయి. నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత కొంత డిప్రెష‌న్‌కి లోనైన స‌మంత ఆ త‌ర్వాత మ‌యోసైటిస్ బారిన ప‌డింది. దీంతో కొన్నాళ్ల పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చింది. కాస్త కోలుకున్న త‌ర్వాత త‌ను క‌మిటైన సినిమాలు పూర్తి చేసి ఇప్పుడు ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టింది. ఇప్పుడు ఏకంగా ఏడాది పాటు సినిమాల‌కి దూరంగా ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ ఖాళీ స‌మయాన్ని స‌మంత స‌ర‌దాగా గ‌డుపుతుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌తో క‌లిసి టూర్స్ వేయ‌డం, ఆధ్యాత్మిక ప్రాంతాల‌ని సంద‌ర్శించ‌డం వంటివి చేస్తుంది. ఇక స‌మంత మ‌రి కొద్ది రోజుల‌లో మ‌యోసైటిస్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్ల‌నుంది.

స‌మంత చివ‌రిగా యశోద, శాకుంతలం అనే లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేయ‌గా ఇందులో య‌శోద పర్వాలేద‌నిపించింది. శాకుంత‌లం డిజాస్ట‌ర్ అయింది. ప్ర‌స్తుతం  విజయ్‌ దేవరకొండకు జంటగా ఖుషి అనే సినిమాను చేస్తుండ‌గా , ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీపై స‌మంత భారీ అంచ‌నాలే పెట్టుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ క్రమంలో ప్ర‌మోష‌న్స్  స్పీడ్ పెంచారు.  ఈ సినిమా ప్రమోషనన్స్‌లో భాగంగా సమంత స్టైలీష్ లుక్‌లో  కనిపిస్తూ పిచ్చెక్కిస్తుంది. ఇక సిటాడెల్ అనే వెబ్ సిరీస్‌తో కూడా స‌మంత సంద‌డి చేయ‌నుంద‌ని టాక్. ఇందులో చాలా బోల్డ్ గా క‌నిపించి స‌మంత సంద‌డి చేయ‌నుంద‌ని అంటున్నారు

స‌మంత ఇప్పుడు సోలోగా తన పని తాను చేసుకుంటున్నప్ప‌టికీ కొంద‌రు ఆక‌తాయిలు ఏదో ర‌కంగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుండి ఆమెపై బాగా ట్రోల్ న‌డుస్తుంది.తాజాగా ఆమె అర‌గుండు ఫోటోని నెట్టింట తెగ వైరల్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇది చూసి స‌మంత అభిమానులు ఆమెని ఎందుక‌లా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం అయితే స‌మంత అర‌గుండు ఫొటో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...