Home Film News Omkar: ఆ సింగ‌ర్‌తో ప్రేమ‌లో ప‌డి ఓంకార్ మోస‌పోయాడా.. అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదా..!
Film News

Omkar: ఆ సింగ‌ర్‌తో ప్రేమ‌లో ప‌డి ఓంకార్ మోస‌పోయాడా.. అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదా..!

Omkar: ఓంకార్ గురించి తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.మొద‌ట‌ యాంక‌ర్‌గా ప‌లక‌రించిన ఆయ‌న ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమాల‌కి నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా కూడా వ్య‌వ‌హ‌రించారు. ఓంకార్ సినిమాలపై కూడా ఇప్పుడు ప్రేక్ష‌కుల‌లో మంచి ఆస‌క్తి నెల‌కొంది. రాజు గారి గ‌ది 2 చిత్రం త‌ర్వాత ఓంకార్ నుండి మంచి సినిమాలేవి రాలేదు. మంచి క‌థ దొరికితే మరో సూప‌ర్ హిట్ అందించాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. అయితే ఓంకార్ అడ‌పాద‌డ‌పా బుల్లితెర‌పై తెగ సంద‌డి చేస్తూ ర‌చ్చ చేస్తుండ‌డం మనం చూస్తూనే ఉన్నాం. ఇస్మార్ట్ జోడి, సిక్త్స్ సెన్స్ అంటూ ఆడియన్స్ ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. అయితే ఓంకార్ ఇప్ప‌టికీ బ్యాచిల‌ర్ గా ఉండ‌గా, ఆయన జీవితంలో ఒక ల‌వ్ స్టోరీ ఉంద‌ట‌.

ఓంకార్ గ‌తంలో టాలీవుడ్ సింగ‌ర్‌ని ల‌వ్ చేశాడ‌ట‌. ఆమెని పెళ్లి కూడా చేసుకోవాల‌ని అనుకున్నాడ‌ట‌. కాని అది అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. ఒక‌సారి ఆ సింగ‌ర్ ని త‌న షోకి పిలిపించి  షో మొత్తం అయిపోయాక ఆమెకి ప్ర‌పోజ్ చేశార‌ట. అప్పుడు ఆ సింగ‌ర్ ఓంకార్ ల‌వ్ యాక్సెప్ట్ చేయ‌కుండా చిన్న స్మైల్ న‌వ్వి వెళ్లిపోయింద‌ట‌. క‌నీసం త‌ర్వాత అయిన ఏమైన స్పందిస్తుందా అంటే అది లేదు. అయితే ఆ సింగ‌ర్ ఓంకార్‌ని కాద‌ని వేరే అబ్బాయిని పెళ్లాడాల‌ని భావించింద‌ట‌. ఈ విష‌యం తెలియ‌గానే ఓంకార్ గుండె రెండు ముక్క‌లైంది.  సింగర్ పెళ్లి చేసుకొని వెళ్లిపోయాక  ఆయ‌న చాలా బాధ‌ప‌డ్డార‌ట‌. ఇలా బాధ‌ప‌డుతూ ఉంటే జీవితంలో ముందుకు సాగ‌లేమ‌ని భావించిన అత‌ను త‌ర్వాత కెరీర్ పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాడ‌ట. ప్ర‌స్తుతం అయితే చాలా హ్యాపీగా ఉన్నాడ‌ని తెలుస్తుంది.

ఆట షో తో బుల్లితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ .. ఆ షో తో అందరికీ అన్నయ్యగా మారిపోయాడు .ఆ  ఫో నుండి ఓంకార్ ఎక్కడ కనిపించినా కూడా అందరూ ఆయనని అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు. అప్పట్లో ఓంకార్ కి ఉన్న క్రేజ్ గురించి  ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్టార్ హీరోలతో సమంగా ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఓంకార్ యాంకరింగ్ కు కొన్ని ఏళ్ళు  బ్రేక్ ఇచ్చి మ‌ళ్లీ త‌ర్వాత కొన‌సాగించాడు. ఓంకార్ షోలో వ‌న్ సెకండ్ అనేది కూడా చాలా ఫేమ‌స్ అయింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...