Home Film News Vaisshnav Tej : మెగా మేనల్లుడి మాస్ అవతార్.. డైలాగ్ అదిరిందిగా!
Film News

Vaisshnav Tej : మెగా మేనల్లుడి మాస్ అవతార్.. డైలాగ్ అదిరిందిగా!

PVT 04
PVT 04

Vaisshnav Tej: హీరోగా ఫస్ట్ సినిమా ‘ఉప్పెన’తో బాక్సాఫీస్ బరిలో సెన్సేషన్ క్రియేట్ చేసాడు మెగా మేనల్లుడు Panja Vaisshnav Tej. 100 కోట్ల వసూళ్లతో తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ హీరోకీ సాధ్యం కాని సరికొత్త రికార్డ్ సెట్ చేశాడు. ‘కొండపొలం’ తర్వాత ‘రంగ రంగ వైభవంగా’ అనే సినిమా చేస్తున్నాడు.

రీసెంట్‌గా వైష్ణవ్ నటించబోయే నాలుగవ సినిమా అనౌన్స్ చేశారు. పిడివి ప్రసాద్ సమర్పణలో.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల మీద సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ‘పెళ్లిసందD’ తో ఇంట్రడ్యూస్ చేసిన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. ఈరోజు పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ‘సుప్రీం హీరో’ సాయి ధరమ్ తేజ్ క్లాప్ నిచ్చారు.

‘రేయ్.. రాముడు లంక మీద పడ్డం వినుంటావ్.. అదే, పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటాదో సూస్తావా?’ అనే వాయిస్ వినిపించగా.. ‘ఈ అయోధ్యలో ఉండేడిది రాముడు కాదప్పా.. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు.. తలలు కోసి సేతకిస్తా నాయాలా’ అంటూ వైష్ణవ్ పవర్‌ఫుల్‌గా చెప్పించి.. సినిమా పక్కా మాస్ మూవీ అని చూపించారు.

వైష్ణవ్ కంప్లీట్ డిఫరెంట్‌గా ఫుల్ లెంగ్త్ మాస్ రోల్‌లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యబోతున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...