Home Film News Jalsa: జల్సా మూవీలో కాలితో తన్నిన రాయికి, కత్తికి ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
Film News

Jalsa: జల్సా మూవీలో కాలితో తన్నిన రాయికి, కత్తికి ఉన్న లింక్ ఏంటో తెలుసా..?

Jalsa: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చే మూవీస్ కి సూపర్ క్రేజ్ ఉంటుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ జల్సా సినిమా చాలామందికి ఫేవరేట్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీలోని డైలాగ్స్, ఫైట్స్, సాంగ్స్ అన్నీ కూడా ఇప్పటికీ ప్రేక్షకులకు కంప్లీట్ ఫేవరెట్ గా నిలిచాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కి స్పెషల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సంజయ్ సాహో పాత్రలో నటించారు. ఈ మూవీలో ఇలియానా, పార్వతి మెల్టన్ లు యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో సీన్స్ కూడా హైలెట్ అనే చెప్పాలి. కొన్ని సీన్స్ మధ్య లింక్ కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఓసారి తన ఫ్రెండ్ కి బాధలు చెప్పుకుంటూ కోపంగా వెళ్లి పాతిఉన్న సరిహద్దు బండను కాలితో తన్ని పైకి తీస్తాడు.

దీంతో పాటు కంటికి కూడా కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్న అంటూ చాలా ఎమోషనల్ అవుతాడు. అదే సీన్ లో కంటికి కనిపించని శక్తి ఏదో భూమిలోకి టన్నుల బరువుతో తొక్కుతున్నట్లు అనిపిస్తుందని అంటాడు. ఆ తర్వాతే ఆ సరిహద్దు రాయిని తన బలం ఉపయోగించి బలంగా పైకి లేపుతారు. ఆ తర్వాత తనలో ఉన్న భయం, డిప్రెషన్ పోయి ప్రశాంతంగా ఉంటాడు. ప్రీ క్లైమాక్స్ లో విలన్ మాట్లాడుతూ కూడా నీకు భయం లేదు అన్నావ్ కదా.. ఇస్తా.. టన్నుల కొద్దీ నీకు భయాన్ని ఇస్తాను అని వార్నింగ్ ఇచ్చే డైలాగ్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. అదే టైమ్ లో క్లైమాక్స్ లో విలన్ కాలిపై కత్తిని చాలా గట్టిగా.. బలంగా దింపుతాడు.

విలన్ ను అక్కడ నుండి తీసుకెళ్లినా కత్తిని మాత్రం రోడ్డుపై నుండి తీయలేకపోతారు. దీంతో క్లైమాక్స్ లో కత్తిని అలాగే చూపిస్తారు. అంటే అక్కడ హీరోను టన్నుల బరువు బయటకు తీస్తే.. ఒక కత్తి సీన్ లో కూడా టన్నుల బరువును భూమిలోకి పంపిస్తాడు. అలా ఈ రెండు సీన్స్ ను త్రివిక్రమ్ చాలా ఇంటిలిజెన్స్ తో సింక్ చేశాడు. కానీ ఈ సీన్ కు సంబంధించిన లింక్ ను మాత్రం ఇప్పటికీ ఎవ్వరూ ఎక్కువగా కనిపెట్టి ఉండరు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...