Home Film News Gopichand: హీరో గోపిచంద్ భార్య ఎవరో తెలుసా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే..?
Film News

Gopichand: హీరో గోపిచంద్ భార్య ఎవరో తెలుసా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే..?

Gopichand: టాలీవుడ్ మాచో హీరో గోపిచంద్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. తొలివలపు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు. హీరోగా ఆ సినిమా వర్కవుట్ అవ్వలేదు. దాంతో నెక్ట్స్ మూవీ తేజ డైరెక్షన్ లో వచ్చిన జయం మూవీలో ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీతో గోపిచంద్ కు విలన్ రోల్ లో విపరీతమైన గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాలోనూ గోపిచంద్ విలన్ గా నటించారు. ఇక ఈ సినిమాతో గోపిచంద్ విలన్ రోల్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు. అప్పట్నుండే గోపిచంద్, ప్రభాస్ ల ఫ్రెండ్షిప్ కూడా స్టార్ట్ అయ్యింది. గోపిచంద్ కు హీరో క్యారెక్టర్లలంటే స్పెషల్ ఇంట్రెస్ట్. దాంతో 2004 లో యజ్ఞం సినిమాలో నటించారు. ఈ సినిమా కమర్షియల్ హిట్ గా నిలిచి గోపిచంద్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నటించిన ఆంధ్రుడు సినిమాలో కూడా హీరోగానే నటించారు. ఈ మూవీ కూడా మంచి హిట్ గా నిలిచింది. అప్పట్నుండి గోపిచంద్ సినిమాల్లో హీరోగా కంటిన్యూ అవుతూ వచ్చారు.

ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తో కలిసి నటించారు. రీసెంట్ గా కూడా రామబాణం మూవీలో నటించి అలరించారు. గోపిచంద్ తన మేనకోడలు అయిన రేష్మను 2013 లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వారికి ఇద్దరు పిల్లలు. తనకు పెళ్లి జరిగి పదేళ్లు కావడంతో రీసెంట్ గా తన పెళ్లి రోజును ప్యారిస్ లో ఈఫిల్ టవర్ దగ్గర సెలెబ్రేట్ చేసుకున్నారు. ప్రజంట్ దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ కు గోపిచంద్, ప్రభాస్ లు వచ్చి అలరించారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...