Home Film News Kollywood: తమిళ తంబీల‌కి 1000 కోట్లు ఎప్పటికీ కలగానే ఉండ‌బోతుందా?
Film News

Kollywood: తమిళ తంబీల‌కి 1000 కోట్లు ఎప్పటికీ కలగానే ఉండ‌బోతుందా?

Kollywood: ఒక‌ప్పుడు సౌత్ సినీ ప‌రిశ్ర‌మ వంద కోట్లు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాలన్నా కూడా చాలా గ‌గ‌నం అన్న మాదిరిగా ఉండేది.  బాహుబ‌లి,కేజీఎఫ్ సినిమాల‌తో సౌత్ సినీ ప‌రిశ్ర‌మ స్థాయి మ‌రింత పెరిగింది. అయితే తెలుగు, క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన సినిమాలు ఇప్ప‌టికే వెయ్యి కోట్లు క‌లెక్ష‌న్స్ టార్గెట్  చేరుకోగా, త‌మిళ సినిమాల‌కి మాత్రం అది అంద‌ని ద్రాక్ష‌గానే ఉంది.  తమిళ సినిమాలకు   1000 కోట్లు ఎప్పటికీ కలగానే ఉండబోతుందా..? జైలర్, విక్రమ్, పొన్నియన్ సెల్వన్ అంత పెద్ద హిట్టైనా.. 400, 500 కోట్ల దగ్గరే ఆగిపోడానికి కారణమేంటి. అనే విష‌యాలు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

అస‌లు త‌మిళ సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా పెద్ద స్టార్ హీరోలు ఉన్నా కూడా  తమిళ సినిమాలు 1000 కోట్ల వైపు వెళ్లట్లేదు.. ఈ అనుమానం నిజంగానే చాలా మంది ఆడియన్స్ మ‌తి తొలుస్తుంది.  తెలుగు, కన్నడ సినిమాలకు సాధ్యమైన రికార్డ్.. కోలీవుడ్‌కు మాత్రం ఎందుకు సాధ్యం కావ‌డం లేదు అని ప్ర‌తి ఒక్క‌రు చాలా ఆలోచిస్తున్నారు.   సింగిల్ లాంగ్వేజ్‌లో 400 కోట్లు కొడుతున్న సినిమాలు.. 1000 కోట్లు వసూలు చేయకపోవడానికి కారణమేంటని అనేక విశ్లేష‌ణ‌లు జ‌రుపుతున్నారు. అయితే త‌మిళుల‌కి  హిందీ మార్కెట్ లేకపోవడం వ‌ల్ల‌నే  సింగిల్ లాంగ్వేజ్‌లో 400 కోట్లు కొడుతున్న సినిమాలు.. 1000 కోట్లు వసూలు చేయకపోవడానికి ప్ర‌ధాన కార‌ణం అంటున్నారు.

తమిళ సినిమాలను కేవలం అక్కడి ఆడియన్స్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని మేక‌ర్స్ చిత్రీక‌రిస్తున్నారు.  పొన్నియన్ సెల్వన్ 1 అండ్ 2 కలిపి 700 కోట్లు వసూలు చేయ‌గా, ఇందులో  ప్యూర్ తమిళ వాసనలున్నందుకే అక్కడ తప్ప మిగిలిన అన్నిచోట్లా కూడా ఈ సినిమా నిరాశ‌ప‌ర‌చింది.  దీంతో వెయ్యి కోట్ల వ‌ర‌కు వెళ్ల‌లేక‌పోయింది. ఇక  రీసెంట్‌గా విడుద‌లైన జైలర్ కూడా హిందీ బెల్ట్‌లో ప్రభావం చూపించలేకపోతుంది. అందుకే 1000 కోట్లు  ఈ సినిమా అందుకోవ‌డం క‌ష్ట‌మే అనిపిస్తుంది.  కమల్ హాసన్ విక్రమ్, విజయ్ సినిమాల లో కూడా అదే మైన‌స్.  బాహుబలి, ట్రిపుల్ ఆర్, కేజియఫ్ 2 1000 కోట్లు వసూలు చేయడానికి హిందీ మార్కెట్ కారణం కాగా,  తమిళ సినిమాలకు అది లేకపోవడం వ‌ల్ల‌నే వాళ్లు వెయ్యి కోట్లు అందుకోలేక‌పోతున్నార‌ని ప్ర‌ధాన కార‌ణంగా చెబుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...