Home Film News Posani: చావు గురించి ప‌దే ప‌దే మాట్లాడుతున్న పోసాని..అలా మాట్లాడ‌డానికి కార‌ణం ఏంటి?
Film News

Posani: చావు గురించి ప‌దే ప‌దే మాట్లాడుతున్న పోసాని..అలా మాట్లాడ‌డానికి కార‌ణం ఏంటి?

Posani: పోసాని కృష్ణ ముర‌ళి.. న‌టుడిగా ఎంత మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.ఆయ‌న కామెడీ ప్ర‌తి ఒక్క‌రికి పుల‌కిరించిపోతారు. చాలా సీరియ‌స్ గా మాట్లాడుతూనే కామెడీ పండించ‌గ‌ల‌డు పోసాని.అయితే వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి, టీడీపీ మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.  అయితే జ‌గ‌న్‌కి వీర విధేయుడిగా ఉన్న‌పోసాని కృష్ణ ముర‌ళి ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమించ‌బ‌డ్డారు. అందుకు తగ్గట్టే పోసాని  ప‌ని చేస్తుండ‌గా ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

తాను చనిపోతే తన శవాన్ని ఇండస్ట్రీలో ఎవరూ చూడటానికి వీల్లేదని ప్ర‌క‌టించిన పోసాని.. ఇందుకు సంబంధించి త‌న భార్య‌ని, కుటుంబాన్ని కూడా ప్రిపేర్ చేసిన‌ట్టు పేర్కొన్నాడు. అయితే ఇప్ప‌టికిప్పుడు త‌ను చ‌నిపోయిన కూడా త‌న భార్య‌కి, త‌న‌కు ఎలాంటి దిగులు లేద‌ని పోసాని పేర్కొన్నాడు.  ఎవరైనా నా గొంతు కోసి చంపినా, లేదంటే నేను చనిపోయినా సరే  ఎవ‌రు కూడా బాధ‌ప‌డ‌వ‌ద్దు. చిన్న కన్నీటి బొట్టు కూడా కార్చ‌వ‌ద్ద‌ని నా భార్య‌కిచెప్పాన‌ని,  ఇండస్ట్రీలో ఎవరూ కూడా నా శవాన్ని చూడటానికి రావొద్దు అని పోసాని సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు.

త‌న‌పై సింప‌తి చూప‌డం ఎవరికి ఇష్టం లేద‌ని చెప్పిన పోసాని తాను గొప్ప‌గా బ్ర‌తికాను కాబ‌ట్టి త‌న‌పై జాలి చూప‌వ‌ద్దు అంటు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మాట్లాడిన మాట‌లు ఇప్పుడు నెట్టింట సంచ‌ల‌నంగా మారుతున్నాయి.  తరచూ ఆయ‌న  తన చావు గురించి మాట్లాడుతూనే వస్తూ ఉండ‌గా, ఎందుకు ఇలా ఆయ‌న త‌న చావు గురించి  మాట్లాడుతున్నారని ఆరా తీయగా.. ప్రతిపక్షాల నుంచి ఆయనకు చంపేస్తామని బెదిరింపులు ఏమైనా వచ్చాయేమో అనే చర్చ న‌డుస్తుంది.. జనసేన, టీడీపీ నుంచి ఇప్పటికే పోసానికి బెదిరింపులు వస్తున్నాయని చెబుతున్న నేప‌థ్యంలో పోసాని ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటార‌నే టాక్ న‌డుస్తుంది. ఇదిలా ఉంటే  గతంలో కూడా పవన్ కల్యాణ్‌ ఫ్యాన్స్ పోసాని ఇంటి మీద రాళ్లు విసిరి నానా ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...