Home Film News Nayanthara: షూటింగ్‌కి రాకు అంటూ న‌య‌న‌తార‌పై ద‌ర్శ‌కుడు ఫైర్.. మరి ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే..!
Film NewsGossips

Nayanthara: షూటింగ్‌కి రాకు అంటూ న‌య‌న‌తార‌పై ద‌ర్శ‌కుడు ఫైర్.. మరి ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే..!

Nayanthara: లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. తెలుగు, త‌మిళంతో పాటు హీందీ భాష‌ల‌లోను అశేష‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. సీనియ‌ర్ హీరోల‌తో పాటు కుర్ర హీరోల‌తో సినిమాలు చేస్తూ కెరీర్‌లో బిజీగా ఉంది న‌య‌న్‌. జ‌వాన్ సినిమాతో ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా అరంగేట్రం చేస్తుంది న‌య‌న‌తార. షారుఖ్‌ఖాన్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది.ఇక ఈ చిత్ర‌మే కాక  త‌మిళంలో నాలుగు సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది న‌య‌న్. అయితే  ప్రస్తుతం న‌య‌న‌తార‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్ఛల్ చేస్తుంది.  నయన తారపై డైరెక్టర్ పార్తీబన్ ఓ సంద‌ర్భంలో చాలా సీరియస్ అయ్యారట. ఈ విషయాన్ని పార్తీబన్ స్వయంగా  చెప్పుకొచ్చారు.

 

నటుడు కమ్ డైరెక్టర్ అయిన‌ పార్తీబన్ తెరకెక్కించాల్సిన ‘కుడైకుళ్ మజై’ సినిమాలో క‌థానాయిక‌గా నయనతారను  అనుకున్నారట. అయితే సినిమా ఆడిషన్స్ కోసం ఉదయం 8 గంటలకు రమ్మని చెబితే, ఆ రోజు రాలేదు.  సాయంత్రం 8 గంటలకు కాల్ చేస్తే.. ‘నిన్న రాత్రి బయలు దేరలేదండీ.. ఈ రోజు రాత్రి బయలు దేరి వస్తానని చెప్పుకొచ్చింద‌ట‌. దాంతో పార్తీబ‌న్ కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో   నువ్వు ఏమి రావొద్దు అని చెప్పానని అన్నారట. అప్ప‌ట్లో నయనతార షూటింగ్స్ కోసం బస్సుల్లోనే తిరిగేదని,  అంత హోదా లేని టైమ్ నుంచి.. ప్ర‌స్తుతం స్టార్ గా ఎదిగిన తీరు ప‌ట్ల చాలా సంతోషం వ్య‌క్తం చేస్తున్నాన‌ని పార్తీబ‌న్ అన్నారు.

పనిపట్ల ఆమెకున్న నిబద్దతను చూసి.. ఆమెతో కలిసి నటించే ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు బాధపడుతున్నానని కూడా  పార్తీబన్ స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న న‌య‌న‌తార‌ హీరోలతో సరిసమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. సినిమా ప్రమోషన్లకు.. ఇంటర్వ్యూలకు దూరంగా ఉండే ఈ అమ్మ‌డు బ్యాక్ టూ బ్యాక్  సినిమాల‌తో అల‌రిస్తూనే ఉంటుంది. ఇక బిజినెస్‌లోను స‌త్తా చాటాల‌ని అనుకుంటుంది న‌య‌న‌తార‌.  చెన్నైలోని ఓ ప్రముఖ థియేట‌ర్‌ను న‌య‌న‌తార కొనుగోలు చేసిన‌ట్లు ఇటీవ‌ల‌ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. నార్త్ చెన్నై ఏరియాలో ఉన్న అగ‌స్త్య థియేట‌ర్‌ను  భారీ ధ‌ర‌కు న‌య‌న్‌ సొంతం చేసుకున్న‌ట్లు కోలీవుడ్‌లో టాక్ న‌డిచింది. ప్ర‌స్తుతానికి అయితే ఈ అమ్మ‌డి సినీ కెరియ‌ర్, వైవాహిక జీవితం రెండు బాగున్నాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...