Home Film News Shots on Singer: లైవ్ లో ప‌ర్‌ఫార్మెన్స్ ఇస్తుండ‌గా సింగ‌ర్‌పై కాల్పులు.. ప‌రిస్థితి ఎలా ఉందంటే..!
Film News

Shots on Singer: లైవ్ లో ప‌ర్‌ఫార్మెన్స్ ఇస్తుండ‌గా సింగ‌ర్‌పై కాల్పులు.. ప‌రిస్థితి ఎలా ఉందంటే..!

Shots on Singer: ఇటీవలి కాలంలో సెల‌బ్రిటీలకి విచిత్ర‌క‌ర‌మైన ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. అభిమానుల నుండి వేధింపులు, దుండ‌గుల నుండి బెదిరింపు కాల్స్ తో పాటు కొంద‌రు ఆగంత‌కుల దాడి కూడా ఆందోళ‌న క‌లిగిస్తుంది. సాధార‌ణంగా సెల‌బ్స్ పలు షాప్స్ ఓపెనింగ్స్‌కి వెళ్ల‌డం వంటివి చేస్తూ ఉంటారు. కాని అక్క‌డ కొంద‌రు జ‌నాలు చేసే వెకిలి చేష్ట‌ల‌కు భ‌య‌ప‌డి కొంత మంది వెన‌క‌డుగు వేస్తున్నారు. ఆ మ‌ధ్య అపర్ణా బాల మురళీకి అటువంటి చేదు అనుభవమే ఎదురైన విష‌యం విదిత‌మే. ఓ కాలేజీలో ఆమెతో ఫోటో దిగేందుకు వ‌చ్చిన‌ ఓ యువకుడు.. ఏకంగా ఆమె మీద చేతులు వేసేందుకు ప్రయత్నించాడు. ఆ స‌మ‌యంలో హీరోయిన్ చాలా ఇబ్బంది పడ్డారు.

ఇక కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఓ నటిని ఫాలో అవుతూ ఓ వ్యక్తి వేధించ‌డం సంఘ‌ట‌న గురించి కూడా మ‌నం విన్నాం. అలానే స‌ల్మాన్ ఖాన్‌కి కూడా ఇటీవ‌ల బెదిరింపు కాల్స్ ఎక్కువ కావ‌డంతో ఆయ‌న త‌న ప‌ర్స‌న‌ల్ సెక్యూరిటీ పెంచుకున్నాడు. ఇక తాజాగా ఓ ఫిమేల్ సింగర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ప్రముఖ భోజ్ పురి ఫోక్ సింగర్ నిషా ఉపాధ్యాయకు తృటిలో ప్రాణాపాయం త‌ప్పింద‌నే చెప్పాలి. నిషా ఉపాధ్యాయ బీహార్‌కి చెందిన ప్రఖ్యాత గాయని కాగా, సరన్ జిల్లాలోని గౌర్ బసంత్‌ ఆమె స్వస్థలం. ఈమె జానపద గాయకురాలు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రదర్శనలు ఇస్తూ అల‌రిస్తూ ఉంటుంది.

 

అయితే నిషాకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. బీహార్ లోని పాట్నాలో ఓ సాంస్కృతిక కార్యక్రమంలో లైవ్ ఫెర్మామెన్స్ ఇస్తుండగా.. ఆమెపై కాల్పులు జ‌రిపారు. దీంతో నిషా ఎడమ తొడకు బుల్లెట్ తగిలినట్లు టాక్. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే నిషాని పాట్నాలోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరు ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర్లేదని అంటున్నారు.. అయితే ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. తమకు సమాచారం అందింది కానీ, రాతపూర్వకంగా ఫిర్యాదు రాలేదని చెప్పుకొచ్చారు. అస‌లు తుపాకీ కాల్పులు ఎలా జరిగాయి, ఎవరు కాల్చారు, ఎవరినీ లక్ష్యంగా చేసుకుని జ‌రిపారు అనే దానిపై ద‌ర్యాప్తు సాగుతుంది. లే లే ఆయే కోకా కోలా, నవకర్ మంత్ర, ధోలిదా ధోల్ రే వగడ్ మరియు హసి హసి జాన్ మారెలా వంటి సాంగ్స్ తో నిషా ఉపాధ్యాయ చాలా ఫేమ‌స్ అయింది.

 

Related Articles

Cómo apostar al tenis mexicano Pin Up

Cómo apostar al tenis mexicano Pin Up

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...