Home Film News Upasana: పుట్ట‌బోయే బిడ్డ‌కోసం ఉపాస‌న అలాంటి నిర్ణ‌యం తీసుకుందా..!
Film News

Upasana: పుట్ట‌బోయే బిడ్డ‌కోసం ఉపాస‌న అలాంటి నిర్ణ‌యం తీసుకుందా..!

Upasana: మెగా కోడలు ఉపాసన కొణిదెల మ‌రి కొద్ది నెల‌లో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత ఉపాస‌న‌ గర్భందాల్చడంతో మెగా ఫ్యామిలీ సహా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ పుట్ట‌బోయే బిడ్డ‌కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఉపాసన సైతం తనకు పుట్టబోయే బిడ్డకోపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటుంది.  తాజాగా ఉపాస‌న తీసుకున్న నిర్ణ‌యం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. తాను పుట్టబోయే బిడ్డ కార్డు బ్లడ్ ను భద్రపరచనున్నట్లు వెల్లడించింది ఉపాస‌న‌.

భవిష్యత్తులో బేబీతోపాటు ఫ్యామిలీ ఆరోగ్యం కోసం అత్యాధునిక పద్ధతిలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్  విధానం తాను ఎంచుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఈ విధానాన్ని వివరిస్తూ ఉప్సీ ఓ వీడియో సోషల్ మీడియాని షేర్ చేసింది. స్టెమ్ సెల్ బ్యాంకింగ్ అంటే.. బొడ్డు తాడు దాచుకోవడం. భవిష్యత్తులో బిడ్డకు ఏవైనా అనారోగ్య సమస్యలు క‌నుక  వస్తే ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధానం స్టెమ్ సైట్ ఇండియా అందుబాటులోకి తెచ్చిందని పేర్కొంది. ఆ సంస్థ ద్వారా ఉపాసన బిడ్డ కార్డు బ్లడ్ సేకరించి భద్రపరచనున్న‌ట్టు తెలిపింది.. ఈ విధానంపై మన దేశంలో పెద్దగా అవగాహన లేదు కాని విదేశాల‌లో ఎక్కువగా ఈ ప్రాసెస్ వాడ‌తారు. గతంలో సూప‌ర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత కూడా తమ పిల్లల విషయంలో ఇలాంటి జాగ్రత్తలే తీసుకుంది.

ఇక ఉపాసన 2012లో రామ్ చరణ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో వివాహం ఘనంగా జ‌రిగింది. అయితే పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నప్ప‌టికీ  ఉపాసన తల్లి కాక‌పోవ‌డంతో వీరి గురించి  అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. వీట‌న్నింటికి తెర‌దించుతూ.. 2022 డిసెంబర్ నెలలో మెగాస్టార్ చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు. కోడలు ఉపాసన తల్లి అయ్యారనే వార్త సోషల్ మీడియా వేదికగా షేర్ చేయ‌డంతో, చిరంజీవి ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఉపాసన సీమంత వేడుకలు  అట్ట‌హాసంగా జ‌రిగాయి.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...