Home Film News Mangli: సాంగ్ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ సింగ‌ర్ మంగ్లీ.. ఇప్పుడు ఆమె ప‌రిస్థితి ఎలా ఉంది?
Film News

Mangli: సాంగ్ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ సింగ‌ర్ మంగ్లీ.. ఇప్పుడు ఆమె ప‌రిస్థితి ఎలా ఉంది?

Mangli: ప్ర‌ముఖ ఫోక్ సింగ‌ర్ మంగ్లీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ఆల్బ‌మ్స్ లో పాడిన మంగ్లీ ఇప్పుడు సినిమాల‌లో కూడా పాడుతూ ఉంది. ఆమె గొంతుకి చాలా మంది అభిమానులు ఉన్నారు.  మంగ్లీ త‌న కెరీర్‌ని  మొదట యాంకర్ గా   మొదలుపెట్టింది. అప్పుడు మెల్ల‌మెల్ల‌గా త‌న పాట‌ల‌ని ప్ర‌జ‌ల‌కి వినిపించ‌డం, అవి ప్రేక్ష‌కులు మెచ్చ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం మంగ్లీ స్టార్ సింగ‌ర్‌గా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకుంది. తక్కువ సమయంలో దాదాపు 100 కి పైగా పాటలు పాడిన ఘ‌న‌త ఆమెకి ద‌క్కింది. మంగ్లీ సింగ‌ర్‌గానే కాకుండా నటిగా పలు సినిమాలు కూడా చేసింది. అయితే మంగ్లీ ప్ర‌తి పండుగకి ఓ ప్రైవేట్ సాంగ్ చేస్తూ అల‌రిస్తుంటుంది.

ఈ క్ర‌మంలోనే  తెలంగాణలో జ‌ర‌గ‌నున్న‌ బోనాలు పండుగ కోసం  ఓ ప్రైవేట్ సాంగ్ షూట్ ప్లాన్ చేసింది. ఈ సాంగ్ కోసం తానే ఆడి పాడుతుంది. అయితే  ఈ షూటింగ్ సమయంలో మంగ్లీ జారీ పడటంతో కాలికి బ‌ల‌మైన‌ గాయం అయిందని తెలుస్తుంది. అయితే కింద ప‌డిన వెంట‌నే మంగ్లీని ఆసుప‌త్రికి త‌ర‌లిచంగా ప్ర‌స్తుతం ఆమెకి చికిత్స అందిస్తున్న‌ట్టు స‌మాచారం. మంగ్లీ కొద్ది రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించిన‌ట్టు తెలుస్తుంది. మ‌రి ఇంత‌కు ఆ సాంగ్ షూట్ పూర్తి చేసిందా, లేదంటే మ‌ధ్య‌లోనే ఇలా ప్ర‌మాదానికి గురైందా అనేది తెలియాల్సి ఉంది.

మంగ్లీకి ప్ర‌మాదం అని తెలిసి ఆమె స‌న్నిహితులు, స్నేహితులు, ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు, అభిమానులు ఆమె త్వ‌ర‌గా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సింగ‌ర్ మంగ్లీ తన కెరీర్‌ని ముందుకు తీసుకువెళ్లడమే కాదు తన చెల్లెల్ని కూడా పుష్ప సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. మంగ్లీ సోద‌రి ఇంద్రవతి చౌహన్ పుష్ప సినిమాలో ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ అనే పాట ప‌డి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు దక్కించుకుంది. ఈ పాట‌కి స‌మంత అదిరిపోయే స్టెప్పులు వేసి అలరించిన విష‌యం తెలిసిందే.  ఇటీవ‌ల మంగ్లీ, ఇంద్రావ‌తి సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...