Home Film News Salaar Villan: స‌లార్ చిత్ర విల‌న్‌కి ఘోర‌ ప్ర‌మాదం.. ఆప‌రేష‌న్ తప్ప‌దంటున్న వైద్యులు
Film News

Salaar Villan: స‌లార్ చిత్ర విల‌న్‌కి ఘోర‌ ప్ర‌మాదం.. ఆప‌రేష‌న్ తప్ప‌దంటున్న వైద్యులు

Salaar Villan: కేజీఎఫ్‌తో క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. ఆయ‌న ఇప్పుడు ప్ర‌భాస్‌తో స‌లార్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్ పాత్ర పోషిస్తున్నారు. వరదరాజ మన్నార్ పాత్రలో న‌టిస్తుండ‌గా, ఇటీవ‌ల ఆయ‌న‌కు సంబంధించిన పోస్ట‌ర్ కూడా విడుద‌లైంది.. ఇక పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో జయన్ నంబియార్ దర్శకత్వంలో  ‘విలాయత్ బుద్ధ’ అనే చిత్రం కూడా రూపొందుతుంది. ఈ చిత్రాన్ని మరయూర్‌లో గంధపు చెక్కల దోపిడీకి సంబంధించిన కథాంశంతో తెర‌కెక్కిస్తున్నారు.

కేరళలోని మారయూర్ బస్టాండ్ వద్ద కే ఎస్ ఆర్టీసీ బస్సులో ఈ సినిమాకి సంబంధించి  ఫైట్ చిత్రీకరిస్తుండగా  అనుకోని ప్ర‌మాదం జ‌రిగింది.  ప్ర‌మాదంలో పృథ్వీరాజ్‌ కాలికి బలమైన గాయం తగిలింది. దీంతో ఆయ‌న‌ని వెంట‌నే కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.  నేడు (సోమవారం) ఉదయం పృద్విరాజ్‌ కాలికి శస్త్ర చికిత్స  చేయనున్న‌ట్టు తెలుస్తుంది. అయితే  ఆపరేషన్ తర్వాత పృథ్వీరాజ్ రెండు లేదా మూడు నెలలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంద‌ట‌. అదృష్ట‌వ‌శాత్తు ప్రాణాపాయమేమీలేదని, చిన్న గాయాలే త‌గిలాయ‌ని ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు.

అయితే మూడు నెల‌ల పాటు పృథ్వీరాజ్ విశ్రాంతి తీసుకుంటే స‌లార్ ప‌రిస్థితి ఏంటి, సినిమాని వాయిదా వేస్తారా, ఇలాంటి ఎన్నో అనుమానాలు అంద‌రి మ‌దిలో మెదులుతున్నాయి. ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. 2022లో బ్రో డాడీ అనే  సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ద‌గ్గ‌ర‌య్యాడు. ఈ  సినిమా తర్వాత జన గణ మన, గోల్డ్, కాపా లాంటి చిత్రాలతో ప్రేక్షకులని ప‌ల‌క‌రించాడు. ప్రస్తుతం పృథ్వీరాజ్ ఆడు జీవితం, విలాయత్ బుద్ధ సినిమాలో నటిస్తున్నారు. మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ ప్రమాదం జరిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్ప‌టిక‌ప్పుడు వాకబు చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమార్  త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.

Related Articles

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల .. ఎన్ని సంవత్సరాలు మ‌రీన‌ మాయని గాయం ఇదే..!

టాలీవుడ్‌లోనే నంద‌మూరీ బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో...

25 లక్షల కోసం ఆ ‘పొలిటీషియన్’తో అంటూ అనుచిత వ్యాఖ్యలు.. “పోరంబోకు వెధవ”.. కోపంతో రెచ్చిపోయిన త్రిష!

ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లపై చీప్ కామెంట్స్ వల్గర్ గా...

చివరికి నాగచైతన్య పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది… సమంత చెప్పినట్లే అయిందిగా..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే..నట సామ్రాట్...