Home Film News Surekha Vani: నాతో పాటు నా పిల్ల‌ల భ‌విష్య‌త్ నాశ‌నం చేయోద్దంటూ వేడుకున్న సురేఖా వాణి
Film News

Surekha Vani: నాతో పాటు నా పిల్ల‌ల భ‌విష్య‌త్ నాశ‌నం చేయోద్దంటూ వేడుకున్న సురేఖా వాణి

Surekha Vani: టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ ప్ర‌కంప‌న‌లు వ‌ణుకు పుట్టిస్తూనే ఉన్నాయి. ఎవరో ఒకరు, ఎక్కడో అక్కడ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవ‌డంతో  టాలీవుడ్‌లో క‌ల‌క‌లం రేగుతుంది. వారం రోజుల క్రితం కబాలి చిత్రం నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ ను విక్రయించే క్రమంలో హైదరాబాద్ పోలీసులకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. ఇక‌ అతని కాల్ డేటాను పరిశీలించగా.. అందులో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్ర‌ముఖులు ఉన్నట్లు గుర్తించారు. ఇక కేపీ చౌద‌రి.. సురేఖా వాణి, అషూరెడ్డి, జ్యోతితో స‌న్నిహితంగా ఉండ‌గా, ఇప్పుడు వారిపై కూడా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఒక‌ పార్టీలో మద్యం మత్తులో కారు పార్కింగ్ దగ్గర కేపీ చౌదరీని సురేఖా వాణి ముద్దాడుతూ కనిపించ‌గా, అందుకు పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రోవైపు సురేఖా వాణి కూతురు కూడా కేపీ చౌద‌రితో చాలా స‌న్నిహితంగా ఉన్న‌ట్టు క‌నిపించింది. అయితే పార్టీలో డ్రగ్స్ వాడటం వల్లనే సురేఖా వాణి  ఎక్కడపడితే అక్కడ ముద్దొచ్చే స్థితికి వెళ్లిందని అంటున్నారు. ఇక ఈ కేసులో అషురెడ్డి, సురేఖా వాణి, జ్యోతి ఇరుక్కున్నారా లేదా అనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు. విచార‌ణ‌లో కేపీ చౌదరీని పోలీసులు  ప్ర‌శ్నించ‌గా, అతను రాజకీయ నేతల కుమారులకు, సెలబ్రిటీలకు, ప్రముఖులకు డ్రగ్స్ ను విక్రయించినట్లు ఒప్పుకున్నాడు. మ‌రి ఈ ముగ్గురు న‌టుల గురించి అయితే ఇప్ప‌టి వ‌ర‌కు నోరు మెద‌ప‌లేదు.

అయితే సోష‌ల్ మీడియాలోమాత్రం సురేఖా వాణిపై దారుణంగా విమ‌ర్శ‌లు చేస్తుండ‌డంతో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది.ఇట‌వ‌ల‌ మీడియాలో మాపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు, మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు చేస్తున్న‌ ఆరోప‌ణ‌ల కార‌ణంగా నా కెరీర్‌, మా పిల్ల‌ల కెరీర్‌, ఫ్యామిలీ భ‌విష్య‌త్, ఆరోగ్యాలు పాడ‌వుతున్నాయి. ద‌య‌చేసి ఇలాంటి ఆరోప‌ణ‌లు చేయ‌కండి’’ అంటూ  సురేఖా వాణి ప్రార్ధించింది.. ప్రస్తుతం అయితే కేపీ చౌద‌రి అరెస్ట్‌తో సినీ ఇండ‌స్ట్రీలో తెలియ‌ని ఓ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం అయితే నెల‌కొంది. ఇది ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...