Home Film News Esha Rebba: పెళ్లి కాకుండానే ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన ఈషా రెబ్బా..ఇది విని సుమ షాక్
Film News

Esha Rebba: పెళ్లి కాకుండానే ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన ఈషా రెబ్బా..ఇది విని సుమ షాక్

Esha Rebba: ఇటీవ‌ల చాలా మంది ముద్దుగుమ్మ‌లు పెళ్లికి ముందే ప్ర‌గ్నెంట్ కావ‌డం ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఈ మ‌ధ్య కాలంలో అలియా భ‌ట్, అమీ జాక్స‌న్, ఇలియానా వంటి వారు పెళ్లికి ముందే ప్ర‌గ్నెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా.. పెళ్లి కాకుండానే ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన‌ట్టు చెప్పి అంద‌రికి పెద్ద షాకిచ్చింది. ఈ టాలీవుడ్ యంగ్ హీరోయిన్  అమీ తుమీ, బ్రాండ్ బాబు,అ, సుబ్రహ్మణ్యపురం, బందిపోటు, అరవింద సమేత వీర రాఘవ వంటి సినిమాల్లో న‌టించి అశేష ప్రేక్షాద‌ర‌ణ సంపాదించుకుంది. మంచి టాలెంట్ ఉన్న‌ప్ప‌టికీ ఈషాకి ఎందుకో పెద్ద సినిమాల‌లో అవ‌కాశం రావ‌డం లేదు.


తాజాగా ఈ అమ్మ‌డు   జె.డి చక్రవర్తి తో కలిసి దయా అనే వెబ్ సిరీస్ లో న‌టించ‌గా, ఇది త్వ‌ర‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మూవీ  ప్ర‌మోష‌న్‌లో భాగంగా తాజాగా  సుమా అడ్డ  అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు ఈషా. ఆమెతో పాటు  జెస్సి, గౌతమి, రవి వర్మలు పాల్గొన్నారు.అయితే శ‌నివారం ప్ర‌సారం కానున్న ఈ షోకి సంబంధించి తాజాగా ప్రోమో విడుద‌ల అయింది.  ఈ ప్రోమోలో గౌతమి చల్లగుళ్ల చెప్పులు లేకుండా రావ‌డంతో  సుమ ‘చెప్పులు ఎందుకు వేసుకోలేదు’ అని ప్రశ్నించింది. దీనికామె ‘దేహమే దేవాలయం’ అంటూ కౌంటర్  వేసింది. ఆ తర్వాత సుమ ‘అవునండీ చెప్పులేనా? బంగారం కూడానా’ అనగా.. గౌతమి ‘నా మనసే బంగారం’ అంటూ మరో కౌంటర్ వేయడంతో షాకైంది.

ఇక జస్వంత్ పడాల అలియాస్ జెస్సీకి సుమ పెళ్లి చూపులు కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయ‌గా,  అక్కడ ఉన్న కొందరు లేడీ స్టూడెంట్లను పిలిచి వాళ్ల టాలెంట్లకు పరీక్ష పెట్టింది. ఇదంతా ఎంతో ఫన్నీగా సాగింది. ఇక, ఈ స్కిట్ చివర్లో జెస్సీ ‘కొట్టేస్తాను మిమ్మల్ని’ అంటూ బొమ్మరిల్లులో జయసుధ డైలాగ్‌ను ఇమిటేట్ చేశాడు. అనంతరం ఆమె ‘తొందరగా పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనిపిస్తుంది’ అని ఓ ప్ర‌శ్న వేయ‌గా.. ఈషా రెబ్బా ‘తొందరపడ్డప్పుడు’ అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ప్రోమో చివర్లో ‘ఈషా ఇప్పుడు నీ ప్రేమ గురించి చెప్పు’ అని అడ‌గ్గా, దీనికి ఈషా రెబ్బా ‘వాస్తవానికి నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు’ అని బాంబ్ పేల్చింది. అయితే  ‘వాళ్ల నాన్న ఎక్కడ ఉంటారు’ అని  సుమ  అడిగింది. దీనికి ఈషా చెప్పిన ఆన్సర్ స‌స్పెన్స్ లో పెట్ట‌గా, అస‌లు నిజం తెలియాలంటే షో మొత్తం చూడాల్సిందే.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...