Home Film News Ram Charan: రామ్ చ‌ర‌ణ్ పొట్టోడంటూ ఆ స్టార్ హీరోయిన్ మూవీ రిజెక్ట్ చేసిందా?
Film News

Ram Charan: రామ్ చ‌ర‌ణ్ పొట్టోడంటూ ఆ స్టార్ హీరోయిన్ మూవీ రిజెక్ట్ చేసిందా?

Ram Charan: చిరంజీవి త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చ‌ర‌ణ్ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.ఇప్పుడు చ‌ర‌ణ్‌కి గ్లోబ‌ల్ స్టార్ డం ద‌క్కిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న భారీ బ‌డ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాని భారీ బ‌డ్జెట్‌తో పొలిటిక‌ల్ నేప‌థ్యంలో రూపొందిస్తున్నారు.ఇక ఈ సినిమా త‌ర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు రామ్ చరణ్. ఇది బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ డ్రామాగా తెలుస్తుండ‌గా, దీనికి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కూడా యాడ్ చేశారంట. మరోవైపు సుకుమార్ డైరెక్ష‌న్ లో కూడా చిత్రం చేయ‌నున్నాడు.

ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ తండ్రిగా కూడా ప్ర‌మోష‌న్ పొందాడు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. రామ్ చ‌ర‌ణ్ ని ఓ హీరోయిన్ పొట్టోడు అని మూవీ రిజెక్ట్ చేసింద‌ట‌. మ‌రి ఆ హీరోయిన్ ఎవ‌రు,ఆ మూవీ ఏంట‌నే క‌దా మీ డౌట్. మూవీ వ‌చ్చేసి మ‌గధీర కాగా, హ‌రోయిన్ అనుష్‌క శెట్టి. స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న స‌మ‌యంలో రాజ‌మౌళి.. మ‌గ‌ధీర చిత్రంలో కాజ‌ల్‌ని క‌థానాయికగా తీసుకోవాల‌ని అనుకున్నార‌ట‌. అందుకు కార‌ణం త‌న క‌న్నా రామ్ చ‌ర‌ణ్ పొట్టిగా ఉండ‌ట‌మే అని అనుష్క చెప్పింద‌ట‌. చ‌ర‌ణ్ తో పోలిస్తే రామ చ‌ర‌ణ్ హైట్ త‌క్కువ‌. తెర‌పై వీరిద్ద‌రూ జంట‌గా క‌నిపిస్తే అక్కాత‌ముళ్ల మాదిరిగా ఉంటార‌ని ముందుగానే ఊహించిన అనుష్క మ‌గ‌ధీరను రిజెక్ట్ చేసింది.

 

దీంతో రాజ‌మౌళి.. అనుష్క‌ స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ని ఎంపిక చేయ‌గా, అది ఆమె కెరీర్ కు ప్ల‌స్ అయింది. ఇక ఈ చిత్రం మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో కూడా మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ మ‌గ‌ధీర‌ చిత్రాన్ని చాలా అద్శుగంగా నిర్మించ‌గా.. చిత్రానికి విజేయేంద్ర ప్ర‌సాద్ క‌థ అందించారు. అలాగే ఎమ్.ఎమ్.కీరవాణి అద్భుత‌మైన స్వ‌రాలు స‌మ‌కూర్చారు. 2009లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అతి పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది. దాదాపు రూ. 40 కోట్ల బ‌డ్జెట్ తో ఈ సినిమాకి రూ. 80 కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి.. తిరుగులేని రికార్డులెన్నో సృష్టించింది. 223 కేంద్రాల‌లో 100 రోజ‌లు.. 299 కేంద్రాల‌లో 50 రోజులు ఆడి అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...