Home Film News Ravi Kishan: కూతురు సాధించిన ఘ‌న‌తకి ఉప్పొంగిపోతున్న రేసుగుర్రం విల‌న్.. !
Film News

Ravi Kishan: కూతురు సాధించిన ఘ‌న‌తకి ఉప్పొంగిపోతున్న రేసుగుర్రం విల‌న్.. !

Ravi Kishan: రేసు గుర్రం విల‌న్ ర‌వి కిష‌న్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయన కేవ‌లం సినిమాలలోనే కాదు టీవీ సీరియ‌ల్స్‌లోను, ప‌లు వెబ్ సిరీస్‌లోను న‌టించి మెప్పించాడు. టాలీవుడ్‌లో దాదాపు పదికి పైగా సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేసి మెప్పించాడు. గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా కూడా గెలిచారు రవి క‌విష‌న్. అయితే ఇటీవ‌ల ర‌వికిష‌న్ కాస్త సినిమాల‌పై దృష్టి త‌గ్గించారు. తాజాగా ఆయ‌న త‌న కూతురిని చూసి ఉప్పొంగిపోతున్నారు. ర‌వి కిష‌న్ కొన్నేళ్ల క్రితం ప్రీతి శుక్లాని వివాహం చేసుకున్నారు.  ఈజంట‌కి  మొత్తం నలుగురు సంతానం ఉండ‌గా, అందులో ఒక కుమారుడు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.

ర‌వ కిష‌న్ పెద్ద కూతురు  రివా కిషన్ ఇఫ్పటికే సినిమాల‌లోకి వ‌చ్చి స‌త్తా చాటింది.  సబ్ కుషాల్ మంగళ్’ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చి అల‌రించింది. ఇక ర‌వి కిష‌న్ మ‌రో కూతురు ఇషితా సైన్యంలో చేరి అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్ఠాత్మక అగ్నిపథ్‌ స్కీమ్‌లో ఇషితా చేర‌గా, ఈ విషయాన్ని రవికిషనే సోషల్‌ మీడియా ద్వారా తెలియ‌జేస్తూ త‌న ఆనందం వ్య‌క్తం చేశారు. ఇషితా వయస్సు కేవలం 21 సంవత్సరాలే కాగా, ఇంత  చిన్న వయసులోనే సరిహద్దుల్లో దేశ సేవ చేయ‌డం కోసం సిద్ధం కావ‌డంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక త‌న‌కూతురిని ఇంతగా ప్రోత్స‌హించిన ర‌వికిష‌న్ పై కూడా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది.  ప్ర‌స్తుతం ర‌వికిష‌న్ నటుడిగా కొనసాగుతూనే అటు పొలిటిషన్ గానూ ప్రజాసేవ చేస్తున్నారు. కార‌ణ‌మేంటో తెలియ‌దు కాని ఏడాది నుండి రవికిషన్ ఎలాంటి సినిమాల్లో కనిపించలేదు. రేసు గుర్రం చిత్రం త‌ర్వాత ర‌వికిష‌న్ .. కిక్‌ 2, సుప్రీం, రాధ, అబద్ధం, ఎమ్మెల్యే, సాక్ష్యం, ఎన్టీఆర్‌ కథానాయకుడు, సైరా నరసింహారెడ్డి, 90 ఎంఎల్‌, హీరో వంటి చిత్రాల‌లో విలన్‌తో పాటు స్పెషల్‌ రోల్స్‌లోనూ సందడి చేసి అల‌రించాడు. ఆయ‌న పాత్ర‌ల‌కు మంచి అప్లాజ్ ద‌క్కేది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...