Home Film News Rana: ఆ స్టార్ హీరోయిన్‌పై కోపంతో చేతిలో బాట‌ల్ ప‌గ‌ల‌గొట్టేశానంటూ రానా షాకింగ్ కామెంట్స్
Film News

Rana: ఆ స్టార్ హీరోయిన్‌పై కోపంతో చేతిలో బాట‌ల్ ప‌గ‌ల‌గొట్టేశానంటూ రానా షాకింగ్ కామెంట్స్

Rana: మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ సల్మ‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సౌత్‌లోనే కాక నార్త్‌లోను అత‌నికి మంచి డిమాండ్ ఉంది. ఇక దుల్కర్ న‌టించిన తాజా చిత్రం  ‘కింగ్ ఆఫ్ కోత’. అభిలాష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 24న ప్రేక్షకుల ముందుకు రానుండ‌గా,ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక రీసెంట్‌గా  హైదరాబాద్ లో నిర్వహించారు.  చిత్రంలో రితిక సింగ్, ఐశ్వర్య లక్ష్మి, అనికా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నాని, రానాలను ముఖ్య అతిథులుగా హాజ‌రు కాగా, నాని మాట్లాడుతూ..త‌న‌కు పాన్ ఇండియా న‌టుడు అనే ప‌దం న‌చ్చదు. కాక‌పోతే పాన్ ఇండియా న‌టుడు అంటే దుల్క‌ర్ మాత్ర‌మేన‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు. దుల్క‌ర్ కోసం  హిందీ డైరెక్టర్లుతో పాటు తమిళ దర్శకులు,తెలుగు డైరెక్టర్లు, మలయాళీ దర్శకులు కూడా కథలు రాస్తారు. అత‌ను నిజ‌మైన పాన్ ఇండియన్ స్టార్ అన్నట్టుగా నాని చెప్పుకొచ్చాడు.

ఇక రానా మాట్లాడుతూ.. ఓ స్టార్ హీరోయిన్‌పై సెటైర్స్ వేశాడు. ఓ సారి దుల్క‌ర్ బాలీవుడ్ నిర్మాత‌ల‌తో సినిమా చేయ‌గా, వారు నాకు స్నేహితులు. అయితే నా ఇంటి షూటింగ్ జ‌రుగుతుంద‌ని ఓ సారి చూద్దామ‌ని పోతే.. హీరోయిన్  ఫోన్‌లో మాట్లాడుతుంది. ఆమె ఫోన్‌లో మాట్లాడుతుంద‌ని షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వ‌గా, దుల్క‌ర్ ఆ స‌మ‌యంలో కామ్‌గా కూర్చొని ఉన్నాడు.  అయితే ఏంటి ఏం జరుగుతుంద‌ని అడ‌గా, ఆమె భ‌ర్త లండ‌న్‌లో షాపింగ్ చేస్తుండ‌గా, ఫోన్‌లో మాట్లాడుతుంద‌ని దుల్క‌ర్.. రానాతో అన్నాడ‌ట‌. ఇక ఆ త‌ర్వాత ఆమె వచ్చి త‌న‌తో ముచ్చ‌ట్లు పెడుతుంద‌ని రానా చెప్పుకొచ్చాడు.

అంద‌రు వెయిట్ చేస్తుండ‌గా, ఆమె నాతో ముచ్చ‌టిస్తుండ‌డంతో షూటింగ్ కానివ్వండి అని సూచించాను. అప్పుడు ఆమె సెట్స్ మీద‌కు వెళ్లి టేకుల మీద టేకులు తీసుకుంటుండ‌డంతో నాకు కోపం వ‌చ్చి చేతిలో ఉన్న వాట‌ర్ బాటిల్ తీసి నెల‌కేసి కొట్టాను.  దుల్కర్ మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నాడంటూ రానా చెప్పుకొచ్చాడు.  అయితే షూటింగ్ పూర్తైన త‌ర్వాత హీరోయిన్ స్టాఫ్ అంతా మూడు కార్ల‌లో వెళ్లిపోగా, దుల్కర్ మాత్రం ఇన్నోవా కారులో సింపుల్‌గా వెళ్లాడ‌ట‌. అప్పుడు త‌న ఫ్రెండ్స్ అయిన నిర్మాత‌ల‌ని తిట్టాన‌ని రానా ఆస‌క్తికర విష‌యాలు తెలియ‌జేశాడు. అయితే  హీరోయిన్ ఎవరబ్బా అని నెటిజన్లు సెర్చ్ చేస్తుండ‌గా,   సోనమ్ కపూర్ పేరు ట్రెండ్ అవుతోంది. జోయా ఫ్యాక్టర్ సినిమాలో సోనమ్ నటించ‌గా, ఆమె గురించే రానా చెప్పి ఉంటాడ‌ని అందరు అనుకుంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...