Home Film News Virupaksha: సూప‌ర్ హిట్ చిత్రం విరూపాక్ష టీవీల్లోకి రాబోతుంది…ఎప్పుడు, ఏ ఛానెల్‌లో అంటే..!
Film News

Virupaksha: సూప‌ర్ హిట్ చిత్రం విరూపాక్ష టీవీల్లోకి రాబోతుంది…ఎప్పుడు, ఏ ఛానెల్‌లో అంటే..!

Virupaksha: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ త‌ర్వాత న‌టించిన తొలి చిత్రం విరూపాక్ష‌. ఎలాంటి అంచ‌నాలు లేకుండా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద విజ‌యం సాధించింది.  డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి ధరమ్, సంయుక్త, రాజీవ్ కనకాల నటన ప్రేక్షకులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్ట‌డం విశేషం. సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రు కూడా విరూపాక్ష చిత్రంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇటీవ‌ల ఓటీటీలోను ఈ చిత్రం విడుద‌ల కాగా, అక్క‌డ కూడా ప్రేక్ష‌కుల‌ని నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది.

చిత్ర  స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకోగా, ఈ మూవీ మే 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.  ఇక థియేట‌ర్, ఓటీటీలో ర‌చ్చ చేసిన విరూపాక్ష ఇప్పుడు టీవీలోను సంద‌డి చేయడానికి సిద్ధ‌మైంది. విరూపాక్ష శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా భారీ ధరకు దక్కించుకోగా, త్వ‌ర‌లోనే ఇది మా టీవీలో ప్ర‌సారం కానుందంటూ  స్టార్ మా ఓ ప్రకటన చేసింది. అయితే విరూపాక్ష సినిమా టీవీలో ఎప్పుడు ప్రసారం కానుంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ అయితే వ‌స్తుంది. చిత్రానికి  కాంతారా ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించ‌గా, సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు.

విరూపాక్ష చిత్రాన్ని రుద్రవనం అనే ఊరి చుట్టూ సాగే కథ‌గా రూపొందించారు. దంప‌తులు చేతబడి చేస్తూ చిన్న పిల్లల మరణానికి కారణమవుతున్నారంటూ  వారిని చెట్టుకు కట్టేసి సజీవదహనం చేస్తారు. వారు మంటల్లో కాలిపోతూ పుష్క‌ర కాలం త‌ర్వాత ఊరు వ‌ల్ల‌కాడు అవుతుంద‌ని శాపం పెడ‌తారు. వారు అన్న‌ట్టుగానే ప‌న్నెండేళ్ల‌కి ఊరులో వ‌రుస మ‌ర‌ణాలు సంభ‌విస్తుంటాయి. అష్ట‌దిగ్భంద‌నం చేసిన కూడా మ‌రణాలు ఆగ‌వు. అయితే ఆ ఊరికి అతిథిగా వ‌చ్చిన హీరో ప్రేమ కోసం  ఆఊరులోనే ఉండిపోతాడు. వ‌రుస చావుల వెన‌క ఉన్న ర‌హ‌స్యాన్ని చేదిస్తాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...