Home Film News Jyothakka: బిగ్ బాస్ ఫేమ్ జ్యోతక్క భ‌ర్త‌పై దారుణ‌మైన ట్రోలింగ్‌.. ఎందుకిలా చేస్తున్నారు?
Film News

Jyothakka: బిగ్ బాస్ ఫేమ్ జ్యోతక్క భ‌ర్త‌పై దారుణ‌మైన ట్రోలింగ్‌.. ఎందుకిలా చేస్తున్నారు?

Jyothakka: అచ్చ‌మైన తెలంగాణ యాస‌లో వార్త‌లు చ‌ద‌వుతూ అడ‌పాద‌డ‌పా స్టార్ సెల‌బ్రిటీస్‌ని కూడా ఇంట‌ర్వ్యూ చేస్తూ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచే యాంక‌ర్ శివ జ్యోతి. ఈమె పేరు చెబితే అంద‌రు గుర్తుప‌డ‌తారో లేదో తెలియ‌దు కాని తీన్మార్ సావిత్రి అంటే మాత్రం ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. బాహుబ‌లి సినిమా ప్ర‌మోష‌న్ స‌మ‌యంలో సావిత్రి చేసిన ఇంటర్వ్యూ ఫుల్ ఫేమ‌స్ అయింది. ప్ర‌భాస్, రానాల‌ని స‌ర‌ద‌గా ఆట ప‌ట్టిస్తూ ఆమె చేసిన ఇంట‌ర్వ్యూకి మంచి పేరు వ‌చ్చింది. ఇక ఆమె బిగ్ బాస్ సీజ‌న్ 3లో శివ జ్యోతికి ఆఫ‌ర్ రావ‌డంతో ఒక్క క్ష‌ణం కూడా ఆలోచించ‌కుండా హౌజ్‌లోకి వ‌చ్చి ప‌డింది.

బిగ్ బాస్ హౌజ్‌లో 14 వారాల పాటు ఉండి బాగానే సంపాదించిన శివ‌జ్యోతి బయటకు వచ్చాక టీవీ 9లో ఇస్మార్ట్ న్యూస్ యాంకర్‌గా మారి, బిత్తిరి సత్తితో పాటు ఎప్ప‌టిలానే ఫన్ పండించింది. ఇక ఇటీవ‌ల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను నిత్యం పోస్ట్ చేస్తూ అల‌రిస్తుంది. భర్త గంగూలీ, స్నేహితులతో కలిసి టూర్లు, ట్రిప్పులు వేస్తూ వాటికి సంబంధించిన విశేషాల‌ని కూడా ఈ అమ్మ‌డు త‌న ఇన్‌స్టా ద్వారా షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవ‌ల సావిత్రి షేర్ చేసిన ప్ర‌తి పోస్ట్‌లో ఆమె భ‌ర్త త‌ప్ప‌క క‌నిపిస్తున్నారు.

 

రీసెంట్‌గా బోనాల సందర్భంగా మా ఆయన బంగారం కొనిచ్చాడు అంటూ యూట్యూబ్‌లో ఓ వీడియా షేర్ చేసింది. దీంతో ఆమె భ‌ర్త‌పై తీవ్ర‌మైన ట్రోల్ చేస్తున్నారు. ఓ నెటిజ‌న్ మీ భ‌ర్త ఏం జాబ్ చేస్తాడు అని కామెంట్ చేయ‌గా, దానికి మ‌రో వ్య‌క్తి ఏం చేయాలో ఆలోచిస్తాడు అని సెటైర్స్ వేశాడు. ఇంకొంద‌రు అయితే ఆమె భర్తపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి జ్యోతి, గంగూలీ పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ స‌మ‌యంలో ఆమెకి చాలా స‌పోర్ట్ గా నిలిచాడు గంగూలి. ఆమె ఈ రంగాన్ని ఎంచుకున్నప్పుడు భర్త గంగూలీ ఆమెను ఎంతో ప్రోత్సహించాడు. భార్య జ్యోతికి వెన్నుదన్నుగా నిల‌వాల‌ని భావించిన అత‌ను ఇప్పుడు ఉద్యోగానికి స్వస్థి చెప్పి.. వీడియో ఎడిటింగ్, ఇతర పనులతో బిజీగా గడుపుతున్నాడు. ఇది తెలియకుండా అతనిపై కొంద‌రు ట్రోల్స్ చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...