Home Film News Bimbisara : ఆరోజు ‘ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు’..
Film News

Bimbisara : ఆరోజు ‘ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు’..

Bimbisara
Bimbisara

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ నటుడిగానే కాకుండా అభిరుచి గల నిర్మాతగా ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నాడు. తాత ఎన్టీఆర్ పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి పలు హిట్ సినిమాలు నిర్మించాడు. ఇప్పుడు తన బావమరిది కె.హరికృష్ణను నిర్మాతగా పరిచయం చేస్తూ ‘బింబిసార’ అనే ప్రెస్టీజియస్ ఫిలిం చేస్తున్నాడు.

‘బన్నీ’, ‘భగీరథ’ చిత్రాల నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు మల్లిడి వశిష్ట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌లో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపించనున్నాడు. కేథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు.. వారీనా హుస్సేన్, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్లకి మంచి స్పందన వచ్చింది. శుక్రవారం సాయంత్రం మూవీ టీం న్యూ అప్‌డేట్ ఇచ్చారు. జూలై 5న కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా జూలై 4న ‘బింబిసార’ ట్రైలర్ రిలీజ్ చెయ్యబోతున్నట్లు ప్రకటించారు. ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు’ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఆగస్టు 5న ‘బింబిసార’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...