Home Film News Himaja: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. అమ్మ‌డి రేంజ్ వేరే లెవ‌ల్‌..!
Film News

Himaja: కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ.. అమ్మ‌డి రేంజ్ వేరే లెవ‌ల్‌..!

Himaja: ఇటీవ‌ల కొంద‌రు ఇట్టే ఎదిగిపోతున్నారు. చూస్తుండ‌గానే కాస్ట్ లీ కారు కొనుగోలు చేయ‌డం, సొంత ఇల్లు నిర్మించుకోవ‌డం వంటివి చేస్తూ అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. బుల్లి తెర న‌టిగా పేరు తెచ్చుకున్న హిమ‌జ‌.. సినీ రంగంలోనూ కామెడీ పాత్ర‌లు, కీల‌క రోల్స్‌లో న‌టించి త‌న‌దైన గుర్తింపు తెచ్చుకుంది. త‌ర్వాత తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి ఫుల్ పాపుల‌ర్ అయింది. విన్న‌ర్ కాక‌పోయిన కూడా ఆ షోతో త‌న ఇమేజ్ మ‌రింత పెంచుకుంది. ఈ అమ్మ‌డు న‌ట‌న ప‌రంగానే కాకుండ‌డా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న‌కి సంబంధించిన విష‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.

ఆ మ‌ధ్య హిమ‌జ నాలుగు అంత‌స్తుల బిల్డింగ్ ని నిర్మించుకుంటున్న‌ట్టు తెలియ‌జేస్తూ వీడియో షేర్ చేసింది. అలానే బ్రాండ్ కియా కార్నివాల్‌ని కూడా కొనుగోలు చేసిన‌ట్టు తెలిపింది.. ఆ కారు ధ‌ర 40 నుంచి 50 ల‌క్ష‌లు ఖ‌రీదు ఉంటుంద‌ని అన్నారు. అయితే తన కృషితో, సంపాదనతో నాలుగంతస్తుల అందమైన ఇంటిని నిర్మించుకున్న ఈ అమ్మ‌డు తాజాగా కొత్తింటిలోకి అడ‌గుపెట్టింది. ఈ విషయాన్ని హిమజ స్వయంగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. త‌న ఫొటో షేర్ చేస్తూ ప్ర‌క‌టించ‌డంతో ఆమెకి అంద‌రు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

గుంటూరు జిల్లా వీరపాలెం గ్రామానికి చెందిన హిమజ తండ్రి మల్లిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బుల్లితెర నిర్మాత. ఆయన నిర్మించిన ‘సర్వాంతర్యామి’ అనే టెలీఫిలింలో తొలిసారి హిమజ నటించగా, ఆ త‌ర్వాత ఆమె టీవీ న‌టిగా, హోస్ట్‌గా కూడా చేసింది. అయితే 2015లో రామ్ హీరోగా న‌టించిన‌ ‘శివమ్’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది హిమ‌జ‌. ‘నేనూ శైలజ’, ‘జనతా గ్యారేజ్’, ‘ధృవ’, ‘మహానుభావుడు’, ‘శతమానం భవతి’, ‘స్పైడర్’, ‘వినయ విధేయ రామ’, ‘చిత్రలహరి’ లాంటి సినిమాల్లో కూడా న‌టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే హిమజ.. 2.3 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ అమ్మ‌డు ఎప్పుడు సోష‌ల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...