Home Film News Chalaki Chanti: గుండెపోటు అనంత‌రం తొలిసారి ప్ర‌త్య‌క్ష‌మైన చలాకీ చంటి… ఇలా అయిపోయాడేంటి?
Film News

Chalaki Chanti: గుండెపోటు అనంత‌రం తొలిసారి ప్ర‌త్య‌క్ష‌మైన చలాకీ చంటి… ఇలా అయిపోయాడేంటి?

Chalaki Chanti: బుల్లితెర ప్రేక్ష‌కులకి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు చ‌లాకి చంటి. త‌నదైన కామెడీతో క‌డుపుబ్బ న‌వ్వించే చ‌లాకి చంటి తొలుత ఓ రేడియో స్టేషన్ లో  జాకీగా ప‌ని చేసి ఆ త‌ర్వాత‌ సినిమాల్లో కమెడియన్ గా కెరీర్ ప్రారంభించారు.   ఈటీవీ ‘జబర్దస్త్‌’తో బుల్లితెరపై ఆయ‌నకి మంచి క్రేజ్ ద‌క్కింది. చ‌లాకి చంటిగా తెలుగు ప్రేక్ష‌కుక‌లకి చాలా ద‌గ్గ‌ర‌య్యారు. ఈటీవీ ప్లస్‌లో  ‘నా షో నా ఇష్టం’ అనే కామెడీ ఎంటర్ టైనర్ షోకు హోస్ట్‌ గా చేసిన చంటి ఆ త‌ర్వాత బిగ్ బాస్ షోలోను వినోదం పంచాడు.  ‘బిగ్‌బాస్‌స సీజ‌న్ 6లో  ఓ కంటెంస్టెంట్‌గా పాల్గొని మరింత క్రేజ్ ద‌క్కించుకున్నాడు.

టీవీ షోల‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్న చ‌లాకీ చంటి   సినిమాల్లో హాస్య నటుడిగా రాణించారు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘సినిమా చూపిస్త మావ’ లాంటి చిత్రాల్లో తనదైన శైలి కామెడీ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే బిగ్ బాస్ కోసం వెళ్లిన చలాకి చంటి స్టార్ మా రూల్స్ ప్రకారం ఏడాది పాటు అక్క‌డే ప‌ని చేశాడు. తాజాగా అగ్రిమెంట్ పూర్తి కావ‌డంతో తిరిగి జ‌బ‌ర్ధ‌స్త్‌లోకి కూడా రీఎంట్నీ ఇచ్చాడు.ఇప్ప‌టికే ఆయ‌న రెండు మూడు సార్లు జ‌బ‌ర్ధ‌స్త్‌ని వ‌దిలి వెళ్లాడు. అయితే జ‌బ‌ర్ధ‌స్త్ ని వ‌దిలి బిగ్ బాస్ కి వెళ్లిన చాలా మంది మాటీవీలో బాగానే సెటిల్ అయ్యారు. కాని చంటి మాత్రం స‌రిగా వాడుకోలేక‌పోయాడు.

ఇటీవ‌ల చ‌లాకి చంటి గుండెపోటుతో ఆసుప‌త్ర‌లో అడ్మిట్ అయిన విష‌యం తెలిసిందే.  ప్రాణాపాయ స్థితి నుండి చంటి బయటప‌డ్డాడ‌డని అప్ప‌ట్లో జోరుగా  వార్తలొచ్చాయి. అనారోగ్యం వ‌ల‌న చలాకీ చంటి మూడు నెల‌ల పాటు బుల్లితెరకు దూరమయ్యాడు. ఇక మూడు నెలల గ్యాప్ అనంతరం సుమ అడ్డా షోలో ప్రత్యక్షమయ్యాడు చంటి. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ సన్నీ, సిరి, కాజల్ తో పాటు చంటి సుమ అడ్డా షోకి రాగా, చంటి కాస్త డ‌ల్‌గానే క‌నిపించిన కూడా గ‌తంలో మాదిరి పంచ్‌లు వేశాడు.  ఇప్పుడు చంటి మరింత బరువు తగ్గి క‌నిపిస్తున్నారు.. దీంతో ఆయ‌న అభిమానులు మీ ఆరోగ్యం ఎలా ఉందని వాకబు చేస్తున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...