Home Film News Upasana Delivery: ఉపాస‌న డెలివరీ ఖ‌ర్చు అంత అయిందా.. అవ‌న్నీ ఎవ‌రు భ‌రించారు..!
Film News

Upasana Delivery: ఉపాస‌న డెలివరీ ఖ‌ర్చు అంత అయిందా.. అవ‌న్నీ ఎవ‌రు భ‌రించారు..!

Upasana Delivery: ఇటీవ‌ల మెగా ఇంట సంతోషం వెల్లివిరిసిన విష‌యం తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న దంపతుల‌కి పండంటి ఆడ‌బిడ్డ జ‌న్మించ‌డంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. రామ్ చ‌ర‌ణ్ అభిమానులు అయితే సోష‌ల్ మీడియాలో తెగ ర‌చ్చ చేశారు.  కొణిదెల వారి ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టిన సంద‌ర్భంలో చాలా ఎమోష‌న‌ల్‌గా మీడియాతో మాట్లాడ‌డం మ‌నం చూశాం. ఈ రోజు చిన్నారికి నామ‌క‌ర‌ణం చేయ‌గా ఆ పేరు నెట్టింట వైరల్ అవుతుంది.. అయితే ఉపాస‌న ప్రెగ్నెంట్ అయినప్ప‌టి నుండి ఆమెకి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంది.
తాజాగా ఉపాస‌న డెలివరీ ఖ‌ర్చుల‌కి సంబంధించిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఉపాస‌న డెలివ‌రీ కోసం ప్ర‌త్యేక‌మైన వైద్య బృందం అపోలోకి వ‌చ్చార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే  ఉపాసన డెలీవరికి బాగానే ఖర్చు అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇక డెలివరీకి సంబంధించి కొన్ని ప్ర‌త్యేక పరిక‌రాలను   విదేశాల నుంచి తెప్పించారని , దాని వ‌ల‌న  మొత్తంగా రూ. కోటీన్నర వరకు బిల్లు అయ్యిందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ ఖ‌ర్చు అంతా ఎవ‌రు భ‌రించారు అంటే దానికి స‌మాధానం రామ్ చ‌ర‌ణ్ అని వినిపిస్తుంది.
త‌న అత్త‌మామ‌లు ఆ ఖ‌ర్చుల‌న్నీ భ‌రిస్తామ‌ని చెప్పిన కూడా త‌న‌కి మ‌హాల‌క్ష్మీ పుట్టింద‌ని ఆ ఆనందంతో ఆ బిల్ అంతా తానే భ‌రిస్తాన‌ని చెప్పాడ‌ట‌. ఏదైతేనేం  రామ్ చరణ్ – ఉపాసన తల్లిదండ్రులు కావడంతో అభిమానులు, మెగా ఫ్యామిలీ మెంబర్స్  పట్టలేని ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక పాప ఫేస్ ఎప్పుడు రివీల్ చేస్తారు, పేరు ఎప్పుడు చెబుతార‌ని మెగా అభిమానులు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇప్ప‌ట్లో అయితే పాప ఫేస్ రివీల్ చేసే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఏడాది పూర్త‌య్యాకే పాప‌ని ప‌రిచ‌యం చేస్తార‌ని మెగా కాంపౌండ్ ద్వారా తెలుస్తుంది. ఇక ఇప్ప‌టికే చిరంజీవికి న‌లుగురు మ‌న‌వ‌రాళ్లు ఉండ‌గా, ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూతురు ఐదో మ‌న‌వ‌రాలు అయింది.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...