Home Film News TV5 Murthy: టీవీ5 మూర్తి డైరెక్ష‌న్‌లో నారా హీరో సినిమా.. ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉందే..!
Film News

TV5 Murthy: టీవీ5 మూర్తి డైరెక్ష‌న్‌లో నారా హీరో సినిమా.. ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉందే..!

TV5 Murthy: రెగ్యుల‌ర్‌గా న్యూస్ ఛానెల్స్ ఫాలో అయ్యే వారికి మూర్తి అంటే తెలియ‌ని వారు ఉండ‌రు. కొన్ని సంవ‌త్స‌రాలుగా మీడియా రంగంలో ఉంటూ ప‌లు డిబెట్స్, ప్ర‌ముఖుల‌తో ఇంట‌ర్వ్యూలు,  చ‌ర్చా కార్య‌క్ర‌మాలు చేసి ఫుల్ పాపుల‌ర్ అయ్యాడు. త‌న‌దైన శైలిలో ప్ర‌శ్న‌లు సంధిస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే మూర్తి ఇప్పుడు టీవీ 5లో పని చేస్తున్నారు. ఇక త్వ‌ర‌లో ఆయన మెగా ఫోన్ ప‌ట్ట‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. నారా రోహిత్ హీరోగా మూర్తి డైరెక్ష‌న్‌లో ఓ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తుంది.  నారా రోహిత్ చివరిగా  ‘ఆటగాళ్లు’, ‘వీర భోగ వసంత రాయులు’ చిత్రాలతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ రెండు  చిత్రాలు 2018లో ప్రేక్షకుల ముందుకు రాగా, ఇవి పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయాయి.

నారా రోహిత్ దాదాపు ఐదేళ్ల పాటు సినిమాల‌కి దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఈసారి స్ట్రాంగ్ క‌మ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇప్ప‌టికే నాలుగు ప్రాజెక్ట్‌ల‌ని సెట్స్ మీద‌కు తీసుకెళ్లిన నారా రోహిత్ త్వ‌ర‌లో మ‌రి కొన్ని ప్రాజెక్ట్‌లు కూడా అనౌన్స్ చేయ‌నున్నాడు. ఇటీవ‌ల నారా రోహిత్  19వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నారా రోహిత్ కమ్ బ్యాక్ చిత్రం రూపుదిద్దుకుంటుండ‌గా, ఈ మూవీ  ఫస్ట్ లుక్ పోస్టర్ ను  జూలై 24న విడుదల చేయబోతున్నట్టు మేక‌ర్స్  అఫీషియల్ గా అనౌన్స్  చేశారు. రీసెంట్‌గా  ప్రీ లుక్‌ పోస్టర్‌ ను విడుదల చేయ‌గా,ఇందులో ’ఒక వ్యక్తి అన్ని అసమానతలకు వ్యతిరేకంగా నిలబడతాడు’ అనే ఆసక్తికరమైన కోట్ ఉంది.

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇతర తారాగణం, టెక్నీకల్ టీమ్, డైరెక్టర్ వంటి అంశాలను ప్ర‌క‌టించ‌లేదు. ఫిలింన‌గ‌ర్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రాన్ని  టీవీ5 మూర్తి డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. పొలిటికల్ సబ్జెక్ట్ తో ఈ చిత్రం రూపొందుతుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ సినిమాతో మూర్తి డెబ్యూ ఇవ్వ‌బోతున్నాడ‌ని స‌మాచారం. గ‌తంలో నారా రోహిత్ ప్ర‌తినిధి అనే సినిమా చేసి అల‌రించ‌గా, ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నార‌నే టాక్ కూడా న‌డుస్తుంది.జూలై 24న వీట‌న్నింటిపై ఓ క్లారిటీ రానుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...