Home Film News Brahmanandam: దేశంలోనే రిచెస్ట్ క‌మెడీయన్ బ్ర‌హ్మానందం.. ఆయన ఆస్తులు గురించి తెలిస్తే నోరెళ్ల‌పెట్ట‌డం ఖాయం..!
Film News

Brahmanandam: దేశంలోనే రిచెస్ట్ క‌మెడీయన్ బ్ర‌హ్మానందం.. ఆయన ఆస్తులు గురించి తెలిస్తే నోరెళ్ల‌పెట్ట‌డం ఖాయం..!

Brahmanandam: ఎవ‌రి కామెడీకి క‌డుపుబ్బ న‌వ్వ‌కుండా ఉంటారో అత‌డే బ్ర‌హ్మానందం. ఆయ‌న కోస‌మే సినిమాలు చూసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. దాదాపు 1000 చిత్రాల్లో నటించిన  బ్రహ్మీ న‌టుడిగా  ఎప్పుడో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు  సంపాదించుకున్నారు. అలానే  సినీ పరిశ్రమలో కళామ్మ‌ తల్లికి చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డు ద‌క్కించుకున్నారు. ఇక  ఇప్పటికీ దేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న హాస్యనటుల్లో బ్రహ్మానందం తొలి స్థానంలో ఉన్నారు. బ్రహ్మానందం తెరపై కనిపిస్తే  అంద‌రి ముఖంపై నవ్వు  రావ‌డం ఖాయం.  తన హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తూ స్టార్ కమెడియన్ గా మారిన బ్ర‌హ్మానందం 1956 ఫిబ్రవరి 1న కన్నెగంటి నాగలింగాచార్య, లక్ష్మీనర్సమ్మ దంపతులకు 7వ సంతానంగా జన్మించారు
మెగాస్టార్ చిరంజీవి ఎంకరేజ్ చేయడంతో ఎన్నో సినిమాల్లో నటించి ఆయ‌న ఈ పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందారు. ఎంఏ తెలుగు చేసిన బ్రహ్మానందం పెద్ద‌లు కుదిర్చిన అమ్మాయి ల‌క్ష్మీని వివాహం చేసుకున్నారు . వీరికి రాజా గౌతమ్, సిద్ధార్ద్ అనే ఇద్దరు కుమారులుండ‌గా. వారిలోఓ కొడుకు ప‌లు సినిమాలు చేశారు.  జంధ్యాల డైరెక్ట్ చేసిన అహ నా పెళ్ళంట సినిమాతో టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అయిన బ్ర‌హ్మానందం ఈ చిత్రంలో అర‌గుండు క్యారెక్టర్ లో ఒదిగిపోయి ప్రేక్ష‌కుల‌కి క‌డుపుబ్బ ఆనందం పంచాడు. ఇప్ప‌టికీ సినిమాలు చేస్తూనే బ్ర‌హ్మీ ఇన్నేళ్ల కెరియ‌ర్‌లో ఎంత సంపాదించాడు అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
ఒక‌ప్పుడు బ్ర‌హ్మీ రెమ్యున‌రేష‌న్ హీరోల‌తో స‌మానంగా ఉండేద‌ని టాక్. ఇప్పుడు ఒక సినిమా చేస్తే రూ.1 కోటి నుంచి రూ. 1 కోటి 50 లక్షల వరకూ రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నార‌ని స‌మాచారం.  దాదాపు రూ.350 కోట్ల ఆస్తులు కలిగిన బ్రహ్మానందం హైదరాబాద్ మణికొండలో పంచాయితీ ట్రావెల్స్ లో దాదాపు రూ.7 కోట్ల విలువైన ది ట్రయల్స్ విల్లాలో నివ‌సిస్తున్నారు. బ్ర‌హ్మానందం దగ్గర ఆడి R8, ఆడి Q7, బ్లాక్ లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ వంటి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆయ‌న చాలా పొదుపుగా తాను సంపాదించిన డ‌బ్బులని దాచిపెట్టి కోట్ల ఆస్తుల‌ని క‌లిగి ఉన్నాడు. ఇక హిందూ దైవమూర్తుల ఫోటోలను గీయడం బ్ర‌హ్మానందానికి చాలా ఇష్టం.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...