Home Film News Aishwarya-Abhishek: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య‌రాయ్‌ల మ‌ధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా?
Film News

Aishwarya-Abhishek: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య‌రాయ్‌ల మ‌ధ్య ప్రేమ ఎప్పుడు, ఎలా పుట్టిందో తెలుసా?

Aishwarya-Abhishek: బాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లో అభిషేక్ బ‌చ్చన్, ఐశ్వ‌ర్యరాయ్ జంట త‌ప్ప‌క ఉంటారు. వీరి వైవాహిక జీవితానికి గుర్తుగా ఆరాధ్య అనే చిన్నారి జ‌న్మించ‌గా, ఆ చిన్నారిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. అయితే అభిషేక్ బచ్చ‌న్ క‌న్నా ముందు ఐశ్వ‌ర్య‌రాయ్ ప‌లువురితో ప్రేమ‌లో ఉండ‌గా, చివ‌రికి అభిషేక్ బ‌చ్చ‌న్‌ని ఎలా పెళ్లి చేసుకుంద‌ని చాలా మందిలో అనుమానం ఉంటుంది. ప‌లు సంద‌ర్భాల‌లో కొంద‌రు నెటిజ‌న్స్  అభిషేక్ బ‌చ్చ‌న్.. ఐశ్వ‌ర్య‌రాయ్‌కి త‌గ్గ వ్య‌క్తి కాదు అంటూ కూడా ట్రోల్స్ చేస్తుంటారు.వీటికి అభిషేక్ బ‌చ్చ‌న్ చాలా సున్నితంగానే స్పందిస్తూ ఉంటారు. అయితే తాను అమెరికన్ సింగర్ రాపర్‌కి పెద్ద అభిమానినని, నేటికీ తనకు ఇష్టమైన పాట  రాపర్ నెల్లీ పాడిన   ‘డైలమా’  పాట అని అభిషేక్ చెబుతూ ఉంటారు.

అయితే తాను ఐశ్వర్య‌రాయ్‌తో డేటింగ్‌లో ఉన్న స‌మ‌యంలో ఆమె త‌న కోసం  నెల్లీ ఆటోగ్రాఫ్‌ తీసుకువచ్చి త‌న‌ని  సర్ప్రైజ్ చేసిందని చెప్పాడు. అతి  నిజంగా అదొక అద్భుతమని అభిషేక్ పేర్కొన్నాడు. 2007లో అభిషేక్, ఐశ్వర్య పెళ్లి చేసుకోగా, అత‌ను  త‌న  కెరీర్ ప్రారంభ చిత్రాలలో మొదటిసారిగా ఐశ్వర్యతో కలిసి పని చేశాడు. తొలి సారి వార‌ద్ద‌రు ‘ధై అక్షర ప్రేమ్‌’లో కలిసి పనిచేశారు. అప్పటి నుంచి వారిద్ద‌రి మ‌ధ్య స్నేహం ఏర్ప‌డింది. అది రాను రాను మ‌రింత బ‌ల‌ప‌డి స్నేహం క‌న్నా ఎక్కువైంద‌ని అభిషేక్ ఓ ఇంట‌ర్యూలో చెప్పుకొచ్చారు.

వయసు పెరిగే కొద్ది ఐశ్వర్యరాయ్ అందం క్ర‌మ‌క్ర‌మంగా  పెరుగుతోంది. సుమారు 19ఏళ్ల క్రితం మిస్‌ వరల్డ్ కిరిటాన్ని దక్కించుకున్నప్పుడు ఎంత అందంగా ఉందో, బిడ్డ పుట్టాక కూడా అదే అందంతో క‌నిపిస్తుంది.  చాలా రోజుల త‌ర్వాత ఐశ్వర్య‌రాయ్ వెండితెర‌పై మెరిసింది. మణిరత్నం పొన్నియ సెల్వం సినిమాలో తన మార్కు నటన ప్రదర్శించి అభిమానుల్నిఎంత‌గానో ఫిదా చేసింది. ఐశ్వ‌ర్య‌రాయ్ అందం చూసి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధుల‌య్యారు. ఇక ఆమె భ‌ర్త అభిషేక్ బచ్చ‌న్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తుండ‌గా, అవి పెద్దగా విజ‌యం సాధించ‌డం లేదు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...