Home Film News Heroine: ఆ హీరోతో చేస్తే చంపేస్తాన‌ని హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చింది ఎవ‌రంటే..!
Film News

Heroine: ఆ హీరోతో చేస్తే చంపేస్తాన‌ని హీరోయిన్‌కి వార్నింగ్ ఇచ్చింది ఎవ‌రంటే..!

Heroine: గత కొద్ది రోజులుగా క‌లర్స్ స్వాతి పేరు వార్త‌ల‌లో తెగ మారుమ్రోగిపోతుంది. అందుకు కార‌ణం ఆమె విడాకులు. బుల్లితెర ప్రోగ్రాం కలర్స్ షో ద్వారా యాంక‌ర్‌గా త‌న ప్ర‌స్థానం మొద‌లు పెట్టిన స్వాతి ఆ త‌ర్వాత సినిమాల‌లో అవ‌కాశాలు ద‌క్కించుకుంది. కేవ‌లం తెలుగులోనే కాకుండా  తమిళ, మలయాళ ఇండస్ట్రీలలో కూడా హీరోయిన్ గా చేసి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకుంది.స్వాతి  తెలుగులో డేంజర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ నాని హీరోగా రూపొందిన అష్టాచెమ్మా సినిమా ఈ అమ్మ‌డికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. ఇక అక్క‌డ నుండి దూసుకుపోయింది స్వాతి.   సుబ్రమణ్యపురం,  స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, గోల్కొండ హై స్కూల్ వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైంది.

ఇక పెళ్లి త‌ర్వాత స్వాతి కాస్త సినిమాలు త‌గ్గించి ఇటీవ‌ల మ‌ళ్లీ  సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది.పంచతంత్రం, ఇడియట్స్ వంటి సినిమాల్లో మెరిసిన స్వాతి రీసెంట్‌గా త‌న భ‌ర్త ఫొటోల‌ని సోష‌ల్ మీడియా నుండి తొల‌గించింది. దీంతో క‌ల‌ర్వ్ స్వాతి కూడా విడాకుల‌కి సిద్ధ‌మైందంటూ ఆమె పేరు నెట్టింట తెగ మారు మ్రోగిపోతుంది. మ‌రి దీనిపై ఇంకా స్వాతి స్పందించ‌లేదు. అయితే ఈ అమ్మ‌డిని ఆ హీరోతో క‌నుక న‌టిస్తే చంపేస్తామ‌ని ఓ సారి వార్నింగ్ వ‌చ్చింద‌ట‌.   కలర్స్ స్వాతి, నిఖిల్ కాంబినేషన్లో స్వామి రారా, కార్తికేయ వంటి రెండు సినిమాలు రాగా,  ఈ రెండు కూడా మంచి విజ‌యం సాధించాయి.

వీరిద్ద‌రి కాంబోలో వ‌రుస‌గా సినిమాలు రావ‌డం, అవి రెండు హిట్ కావ‌డంతో  ఇద్ద‌రి మ‌ధ్య ఏదో న‌డుస్తుందంటూ ప్ర‌చారాలు సాగాయి. ఇది తెలిసిన కుటుంబ స‌భ్యులు ఇంకోసారి నిఖిల్‌తో న‌టిస్తే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చార‌ట‌. ఇక సినిమాలు కూడా నిన్ను చేయ‌నివ్వం అని బెదిరించే స‌రికి నిఖిల్‌తో  చేయాల్సిన శంక‌రాభ‌ర‌ణంని రిజెక్ట్ చేసింద‌ట‌.ఆ  సినిమాకి తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి  ఇచ్చేసింద‌ని చెబుతున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...