Home Film News Samantha : ‘యానిమల్’ లో సమంత స్పెషల్ సాంగ్
Film News

Samantha : ‘యానిమల్’ లో సమంత స్పెషల్ సాంగ్

Samantha
Samantha

Samantha: స్టార్ హీరోల సినిమాల్లో ఆడిపాడుతూనే, లేడీ ఓరియంటెడ్ మూవీస్, వెబ్ సిరీస్, క్రేజీ ఫిలింస్‌లో కిరాక్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది సమంత. ఈ ఏడాది హాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తోంది. ‘ది ఫ్యామిలీ మెన్ 2’ తర్వాత బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి.

ఇక గతేడాది చివర్లో ‘ఊ అంటావా మావా’ సాంగ్‌తో రచ్చ రంబోలా చేసింది సామ్. సౌత్ మొత్తాన్నీ ఓ ఊపు ఊపేసిందీ సాంగ్. ముఖ్యంగా సామ్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్, స్టెప్స్‌తో మగజాతి మొత్తానికీ కంటిమీద కునుకు లేకుండా చేసింది.

ఇటీవల బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఈ సాంగ్ తన ఫేవరెట్ అని చెప్పారంటే.. సమంత ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు ఎంతో మంది ఎన్నో రకాలుగా రీల్స్ చేసి సోషల్ మీడియాని షేక్ చేసేశారు.

ఇప్పుడు సామ్ ‘యానిమల్’ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చెయ్యనుందని బాలీవుడ్ మీడియా వర్గాల వారి సమాచారం. రణ్‌బీర్ కపూర్ హీరోగా.. ‘అర్జున్ రెడ్డి’ సెన్సేషన్ క్రియేట్ చేసి, హిందీలో ‘కబీర్ సింగ్’ తో బాలీవుడ్ వారిని సైతం ఆశ్చర్యపరిచిన సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తున్నారు.

అనిల్ కపూర్, బాబీ డియోల్, పరిణీతి చోప్రా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ క్రైమ్, డ్రామా ఫిలింలో సమంతతో ఓ స్పెషల్ సాంగ్ చేయించాలనుకుని, మేకర్స్ అప్రోచ్ అవగా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. తెలుగులోనే ఇంత రచ్చ చేస్తే, ఇక హిందీలో స్పెషల్ సాంగ్‌ అంటే ఆ అందాల ఆరబోత ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు అంటూ మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...