Home Film News Indra Movie: ఆ బాలీవుడ్ ఛానెల్ టీఆర్పీ పెంచుకోవ‌డానికి చిరంజీవి ఇంద్ర సినిమా దిక్కైంద‌ని తెలుసా?
Film News

Indra Movie: ఆ బాలీవుడ్ ఛానెల్ టీఆర్పీ పెంచుకోవ‌డానికి చిరంజీవి ఇంద్ర సినిమా దిక్కైంద‌ని తెలుసా?

Indra Movie: మెగాస్టార్ చిరంజీవి సూప‌ర్ హిట్ చిత్రాల‌లో ఇంద్ర చిత్రం ఒక‌టి.  బి.గోపాల్ దర్శకత్వంలో తెర‌కెక్క‌న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించ‌గా,  పరుచూరి బ్రదర్స్ సంభాషణలను, చిన్ని కృష్ణ కథను సమకూర్చారు. ఇక చిత్రంలో చిరంజీవి స‌ర‌న‌స‌న‌ సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ కథానాయకులుగా న‌టించారు.. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో నడిచిన సినిమా జూలై 24, 2002లో విడుదలై విధ్వంస‌మే సృష్టించింది.ఆ రోజుల్లోనే ఈ సినిమాకి 50 కోట్లకి పైగా క‌లెక్ష‌న్స్ వచ్చాయంటే ఈ మూవీ ఏ రేంజ్‌లో దూసుకుపోయిందో అర్ధం చేసుకోవ‌చ్చు. సౌత్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ఈ చిత్రం అనేక రికార్డుల‌ని త‌న ఖాతాలో వేసుకుంది.

ఇంద్ర’ ప్రభంజనం గురించి చెప్పుకొస్తే.. ఈ సినిమా రికార్డ్ ని సౌత్ ఇండ‌స్ట్రీలో ఏ చిత్రం కూడా మూడేళ్ల వ‌రకు చెర‌ప‌లేక‌పోయింది.  రజనీకాంత్ ‘చంద్రముఖి’ 2005లో వచ్చి అప్పుడు ఈ సినిమా రికార్డ్  బ్రేక్ చేసింది. అనంత‌రం నాలుగేళ్ళకు ‘పోకిరి’ సినిమా ఈ  రికార్డ్ బ‌ద్ద‌లు కొట్టింది. ఇంద్ర సినిమాని హిందీలో  ‘ఇంద్ర ది టైగర్’ పేరుతో డబ్ చేసి బాలీవుడ్‌లో టెలివిజన్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ  సినిమాకి హిందీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. సినిమా రైట్స్ కొన్న ఛానల్స్ మంచి టీఆర్పీ వ‌స్తుంద‌ని  రెండు వారాలకోకసారి సినిమాని టెలికాస్ట్  చేసి ఛానల్ రేటింగ్ పెంచుకునేవారట.దీనిపై నేష‌నల్ మీడియా ఓ స్పెష‌ల్ ఆర్టిక‌ల్ కూడా రాసింది.

ఇంద్ర సినిమా కోసం మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం చాలా విన‌సొంపుగా ఉంటుంది.  చిరంజీవి కోసం ఆయన ఎన్నో మరపురాని పాటలను స్వరపరచ‌డం మ‌నం  చూశాం. ఇప్పుడు మ‌ణిశ‌ర్మ‌ కుమారుడు, మహతి స్వర సాగర్, చిరంజీవి రాబోవు చిత్రం ‘భోళా శంకర్ కి   సంగీతాన్ని అందిస్తున్నారు.  ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మ‌హ‌తి మాట్లాడుతూ.. త‌న  తండ్రి కంపోజిషన్లలో ఒక సాంగ్ ను రీమిక్స్ చేయాలని అనుకుంటున్న‌ట్టు తెలియ‌జేశాడు. అవకాశం ఇస్తే భవిష్యత్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘ఇంద్ర’ చిత్రంలో నుంచి ఐకానిక్ ‘ట్రాక్ రాధే గోవింద’ను రీమిక్స్ చేయాలని భావిస్తున్నట్టు తన మనసులోని కోరికను వ్య‌క్తం చేశారు.ఇది విని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...